నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు.. 5వ లైన్‌పై రైలు నిలిచిపోయింది.. దీంతో.. పట్టాల పైనుంచి పక్కకు ఒరిగాయి చివరి 5 బోగీలు.. అయితే, రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..
దసరాకు 3 వేల 40 ప్రత్యేక బస్సులను నడపనుంది ఏపీఎస్ఆర్టీసీ. అక్టోబర్ 4 నుంచి 11 మధ్య హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు.. ఏపీలోని ముఖ్య ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తోంది.
మూడున్నర ఏళ్లుగా కార్మికుల చేతుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరింది. స్టీల్ ప్లాంట్ మనగడసాగించాలన్నా.. మూతపడాలన్న వచ్చే ఆరు నెలలు అత్యంత కీలకమైన సమయంగా ప్రజాసంఘాలు భావిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలోని ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని ఆదుత్యి మూలవీరట్ పాదాలను తాకాయి లేలేత సూర్యకిరణాలు. అరుణ వర్ణంలోని భానుకిరణాల స్పర్శతో దేదీప్యమానంగా మూలవిరాట్ భక్తులకు దర్శనం ఇచ్చింది. ఉదయం 6:05 గంటలకు కొన్ని నిమిషాలపాటు ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యాన్నం భక్తులకు కనువిందు చెసింది.
ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.. ఇక వైఎస్ జగన్ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.. ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి.. ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి.. ఇక, దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు..
ఇవాళ ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నెయ్యి నిల్వ చేస్తారు.. ప్రసాదాల తయారీకి ఎలా తరలిస్తారు.. లడ్డూ తయారీ ఎలా ఉంటుంది.. తయారైన లడ్డూలను ఎలా కౌంటర్లకు తరలిస్తారనే అంశాలపై సిట్ దృష్టిపెట్టనుంది. లడ్డూ పోటులో పనిచేసే సిబ్బందిని ప్రశ్నించి.. లడ్డూ తయారీ నుంచి.. విక్రయాల విక్రయాల వరకు ఉండే ప్రాసెస్‌ను ఇవాళ పరిశీస్తారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?