విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వైభవం కొనసాగుతోంది. ఇవాళ మహాలక్ష్మీ అవతారంలో దర్శనం ఇస్తున్నారు.. కనకదుర్గ అమ్మవారు. అమ్మలగన్న అమ్మ దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకూ మహాలక్ష్మీ దేవి అవతారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడవాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఐదవరోజైన ఇవాళ సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు స్వామివారికి అత్యంత ప్రియమైన గరుడసేవ జరగనుంది. గరుడ వాహనంపై మలయప్ప దర్శనం సర్వ పాపహరణం గరుడ సేవ రోజున లక్ష్మీకాసుల హారం, సహస్రనామ మాల, పచ్చలహారాన్ని ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డిని నకిలీ సీబీఐ అధికారులు బెంబేలెత్తించారు. ముంబైలోని సీబీఐ అధికారులుగా చెబుతూ 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఇదివరకే వాకాటిపై సీబీఐ కేసులు ఉండటంతో ఆయనకు కొంత అవగాహన ఉంది. దీంతో ఆయన గట్టిగా సమాధానం చెప్పినప్పటికీ.. వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణమైన ఘటన జరిగింది.. ఇందిరానగర్ లో మైనర్ బాలికకు మద్యం పట్టించి.. ఆపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు.. నిందితుడిగా పేర్కొంటున్న మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.
పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవిని జనసేనకు.. వైస్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు.. అయితే, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మూడు చోట్ల పోటీ చేస్తే మూడు చోట్ల విజయం సాధించగా.. టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట మాత్రమే గెలిచారు.. ఇదే ఇప్పుడు చర్చగా మారింది..
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఆహ్వానించారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు.. నేడు భారతదేశ పార్లమెంట్ స్పీకర్ శ్రీ ఓం బిర్లాను కలిసి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసినట్టు వెల్లడించారు..