Deputy CM Pawan Kalyan: సర్పంచ్‌లతో సమావేశం.. వాలంటీర్లపై తేల్చేసిన డిప్యూటీ సీఎం పవన్..
- సర్పంచ్ సంఘాలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ..
- వాలంటీర్ వ్యవస్థ రద్దుపై కీలక వ్యాఖ్యలు..
- వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే ఉన్నాం..
- గత ప్రభుత్వం వారిని మోసం చేసిందన్న పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచ్ సంఘాలతో సమావేశం అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై స్పందించిన పవన్.. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. అయితే, గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు.. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు.. కానీ, వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.. ఇదో సాంకేతిక సమస్య అన్నారు.. ఇక, గ్రామలకు నీళ్లు పంపడానికి సరైన పైప్ లైన్ల విషయంలో పూర్తిగా మార్పులు తెస్తాం.. టెక్నికల్ గా లోపాలు గుర్తించాం అన్నారు పవన్.. గ్రామలకు సంబంధించిన నిధులు విడుదలపై ఆర్ధిక శాఖతో మాట్లాతాం అన్నారు..
Read Also: Anil Ambani : అనిల్ అంబానీకి షాక్.. తన ఫేవరేట్ కంపెనీకి మూడేళ్ల పాటు నిషేధం
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఉచిత విద్యుత్ విషయంలో కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం.. ఉచిత విద్యుత్ అంశంపై కేబినెట్ లో మాట్లాడతామని తెలిపారు పవన్ కల్యాణ్.. క్వారీలలో బాంబు పేలినా చాలా ఇళ్ళు దెబ్బతింటాయి.. సినరేజీ గురించి మాట్లాడుతాం.. బకాయిలు లక్షకోట్లు దాటేలా కనిపిస్తోంది… మేం ప్రతీ అంశంలో పూర్తిగా కట్టుబడి ఉన్నాం.. స్టేట్ ఫైనాన్స్ కమీషన్ నుంచీ రావాల్సిన వాటిపైన కూడా ఆర్ధిక శాఖతో మాట్లాడుతాం అన్నారు.. సర్పంచ్ అనేవాళ్లు గ్రామ ప్రధమ పౌరుడు.. వారికి గౌరవానికి లోటుండకూడదన్న ఆయన.. గాంధీ గారు పెట్టిన పంచాయితీరాజ్ చట్టాన్ని పూర్తిగా నీరుకార్చారని విమర్శించారు.. సోషల్ ఆడిట్ చేయడానికి ఒక డీఎస్పీ స్ధాయి అధికారిని ఏర్పాటు చేశాం.. సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులు పెట్టాలని కచ్చితంగా చెప్పాం అన్నారు.. ప్రతి కార్యక్రమం కూడా పంచాయితీ ప్రజలకు వాట్సప్ ద్వారా పంపడం పై ఆలోచిస్తున్నాం అని వెల్లడించారు. సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులు విషయంలో సర్పంచులు కూడా బాధ్యత వహించాలని సూచించారు.. మాది వినే ప్రభుత్వం.. మెత్తగా చప్పగా ఉండే ప్రభుత్వం కాదన్నారు..
Read Also: Khammam: ఖమ్మంలో ఘరానా మోసం.. ఏటీఎం నగదు బదిలీలో ఆరితేరిన ఆ ముగ్గురు..
ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత తీసుకున్నాక కొన్నిసార్లు తిట్లు తప్పవు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అంశాలపై కచ్చితంగా స్పందిస్తారని తెలిపారు.. ఇక, వాలంటీర్ల వ్యవస్ధ అనేది ఒక సమాంతర వ్యవస్థగా ఉంది.. కానీ, గ్రామ సచివాలయ సిబ్బందిని రద్దు చేయడంపై ఆలోచించలేదన్నారు.. వలంటీర్లను మోసం చేసి పెట్టుకున్నారు… వారి జీతాలు పెంచాలన్నా కూడా జీవోలో సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!