బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పెన్లన్లు అందజేశారు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అన్నారు.. దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తుంది ఏపీలోనే అని స్పష్టం చేశారు.. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నాయకులు.. కూటమి ప్రభుత్వం పై నింధలు వేయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం భయటపడింది. ఈ సారి ఏకంగా శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించే అర్చకులు బస చేసే అర్చక నిలయం ముందే క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రభోధాలు ఉన్న వాహనాన్ని నిలపడం విమర్శలకు దారితీసింది.
అధికారంలోకి వస్తే.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలో ఉంది. కొత్త ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతోంది. కానీ.. చెప్పిన ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. జనవరిలో షెడ్యూల్ ప్రకటించి, ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు కార్యాచరణ రూపొందుతోందట.
ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఇతర చోట్ల కూడా వైసీపీకి అన్నీ తానై వ్యవహరించిన నాయకుడు. ప్రస్తుతం ఆ పార్టీకి బైబై చెప్పేసి జనసేనలో ఉన్నారు. గత ఐదేళ్లలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఫస్ట్‌హాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ మాత్రం కలసి రాలేదు. అలకలు, బుజ్జగింపుల పర్వంతోనే పుణ్యకాలం గడిచిపోయింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు రాజ్‌భవన్‌కు వెళ్లారు.. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక, రాష్ట్రానికి కుటుంబ సమేతంగా వచ్చిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది. డిన్నర్ చేస్తూ రాష్ట్ర పరిస్ధితులపై గవర్నర్, మాజీ రాష్ట్రపతిలతో చర్చించారు సీఎం చంద్రబాబు..
వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. వైఎస్ జగన్ కు నిజంగా బిరుదులు, అవార్డులు ఇవ్వాల్సిందేనన్న ఆయన.. ప్రపంచ స్థాయిలో అవినీతి చేసినందుకు ‘ఇంటర్నేషనల్ క్రిమినల్’ అవార్డు ఇవ్వొచ్చు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు..
బనగానపల్లె జుర్రేరు వాగు ఆధునీకరణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి... కాటసాని రామిరెడ్డికి సవాల్ విసిరిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాటసాని తన అనుచరుని ఫంక్షన్ హాల్ కోసమే జుర్రేరు వాగు ఆక్రమించి వాకింగ్ ట్రాక్ నిర్మించారని ఆరోపించారు.. అక్రమ నిర్మాణాలన్నీ కచ్చితంగా తొలగిస్తాం, ఆక్రమణదారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణ నడి బొడ్డున ఉన్న జుర్రేరు వాగు ఆధునీకరణకు సంబంధించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ…