MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు..
- తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు..
- గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా నామినేషన్లు..
- నేటితో ముగియనున్నాన మినేషన్ల గడువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు నేడు గుంటూరు కలెక్టరేట్‌లో పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణరావు నామినేషన్ వేయనున్నారు. ఇక రేపు నామినేషన్లు పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. ఈనెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు గడువునిచ్చింది ఈసీ. ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ చేస్తారు. అయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 3 లక్షల 15 వేల 267 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. దీంతో 440 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఈసీ.
Read Also: OYO : వాలంటైన్స్ డే ముందు ఓయోకు గుడ్ న్యూస్.. ఆరు రెట్లు పెరిగిన లాభం
Also Read
కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ… నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 85 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. నేడు గడువు ముగియనుండడంతో పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. అటు వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేడు పీఆర్‌టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్‌ను వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Read Also: Viral Video: నీ మైండ్ ఏమైనా దొబ్బిందా?.. బౌలర్‌పై రోహిత్ శర్మ ఫైర్!
ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగియనుంది. స్వీకరించిన నామినేషన్లు మంగళవారం పరిశీలిస్తారు. ఈనెల 13 వరకు ఉపసంహరణకు గడువిస్తారు. మరోవైపు శుక్రవారం నాటికి పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు 23 మంది నామపత్రాలు అందజేశారు. శని, ఆదివారాలు సెలవు దినాలు. సోమవారం చివరిరోజు కాగా, హడావుడి ఎక్కుగా ఉండే అవకాశం ఉంది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. బీజేపీ తరఫున పులి సరోత్తమ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తమ అభ్యర్థి ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తాము ఎవరినీ బరిలోకి దింపడం లేదని భారత రాష్ట్ర సమితి ప్రకటించింది. గట్టి పోటీనిచ్చే స్వతంత్రుల్లో ఎవరికైనా మద్దతు ఇవ్వాలనే యోచన కొట్టిపారేయలేమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్, పింగలి శ్రీపాల్ పీఆర్‌టీయూ నుంచి బరిలో నిలుస్తుండగా.. వారు నేడు తమ అనుచరులతో కలిసి మరో సెట్‌ను దాఖలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!