ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి ఆరు నెలలు కావస్తోంది. కూటమి సర్కార్ పవర్లోకి వచ్చాక... నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన, తమను ఇబ్బందులు పెట్టిన నాయకులు, ఇతరుల టార్గెట్‌గా పావులు కదులుతున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. వైసీపీ ప్రభుత్వంలోఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వారితోపాటు పార్టీని భుజానికెత్తుకుని అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై ఇష్టా రీతిన మాట్లాడిన నేతలు అందరి మీద వరుస కేసులు బుక్ అవుతున్న పరిస్థితి. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదన్నట్టుగా ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు ఎన్డీఏ కూటమిలో పడటం లాంఛనమే. అయితే రాజ్యసభలో అడుగు పెట్టేది ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు. ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అన్నయ్య నాగబాబును రాజ్యసభకు పంపే పనిలోపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.
డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ఈగల్‌ను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో కేంద్ర కార్యాలయం... 26 జిల్లాల్లో 26 నార్కోటిక్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఉత్వర్వులు ఇచ్చింది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా... సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ఆదేశించింది. అయితే, హెడ్ ఆఫీసులో ఉద్యోగుల కాలపరిమితి మూడేళ్ల నుంచి ఐదేళ్లుగా నిర్ణయించింది. మరోవైపు.. డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు…
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.. అయితే, నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిపోయింది సిట్.. కొంతకాలం ఈ వ్యవహారంలో సైలెంట్‌గా ఉన్న సిట్.. ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తుని వేగవంతం చేసింది.. ఈ రోజు శ్రీవారి ఆలయంలోని పోటులో సిట్ బృందం తనిఖీలు నిర్వహించింది..
ఏపీలో తనపై కేసుల నమోదుపై ఆర్జీవీ వరుస ట్వీట్లు.. 22 పాయింట్లు లేవనెత్తిన వర్మ.. నా కేసు-RGV అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు పెట్టిన ఆయన.. జాతీయ మీడియాతో పాటు తెలుగు మీడియాను ట్యాగ్ చేస్తూ.. 22 పాయింట్లు లేవనెత్తారు..
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది.. ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 3కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ప్రస్తుతానికి ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 130 కి.మీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 320 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ…
అదానీ కేసుల వ్యవహారంపై స్పందించిన వైఎస్ జగన్.. అదానీపై నమోదైన కేసులో నా పేరు ఎక్కడా లేదన్నారు.. ముఖ్యమంత్రులను పారిశ్రామిక వేత్తలు కలుస్తారు.. పారిశ్రామిక వేత్తలను తీసుకు రావటం కోసం ప్రతి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు వైఎస్ జగన్.. ఐదేళ్ల కాలంలో అనేక అనేక మార్లు అదానీ కలిశారని తెలిపిన ఆయన.. ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నారని వెల్లడించారు.. అయితే, తనను అదానీ కలవడంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందనే విధంగా చూపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఏపీ చరిత్రలోనే మా హయాంలో జరిగిందే అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు అని స్పష్టం చేశారు.. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్సెంటీవ్ ఇస్తామని చెప్పింది.. రూ.5.10 నుంచి రూ.2.49కి యూనిట్ ధర తగ్గింది.. మనకు 15 వే9ల మి.యూ. విద్యుత్ వినియోగం ఉంది.. దీని వల్ల లక్ష కోట్లు ఆదా చేయడం సంపద సృష్టి…