Tirupati Laddu Ghee Adulteration Case: తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్, సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నలుగురు నెయ్యి సరఫరాదారులు అరెస్ట్ చేశారు. ఏర్ డైరీ ఏండీ రాజశేఖరన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు బోలేబాబా డైరీ నిర్వాహకులతోపాటు.. నెల్లూరు వైష్ణవీ డైరీకి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో నిందితులను ప్రవేశపెట్టింది సిట్.. ఆ తర్వాత ఈ నెల 20వ తేదీ వరకు ఆ నలుగురు నిందితులకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి.. ఇక, త్వరలో ఈ వ్యవహారానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులను విచారణ పిలిచే అవకాశం ఉందంటున్నారు.. లిస్ట్ లో ఉన్న రాజకీయ నేతలతో పాటు.. టీటీడీలోని కీలకమైన అధికారులను విచారణకు పిలిచే అవకాశాలున్నాయి..
Read Also: Terrorist Attack : వాహనాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపారు.. 25 మంది మృతి
తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్‌ను నియమించింది. ఇందులో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు భారత ఆహార భద్రత-ప్రమాణాల అథారిటీకి చెందిన సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారని, సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. మొత్తంగా గత సంవత్సరం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో మూడు రాష్ట్రాల్లోని మూడు డెయిరీలకు నాయకత్వం వహిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నెయ్యి సరఫరాలో ఉల్లంఘనలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది..