పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమయ్యారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆక్వా రైతులు. నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని మంత్రిని కోరారు రైతులు.. అయితే, వారి సమస్యలను విన్న మంత్రి గొట్టిపాటి.. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రైతులకు హామీ ఇచ్చారు..
రైతులకు అండగా ఉంటాం.. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పిస్తాం.. కానీ, రైతులు దళారులను ప్రోత్సహించొద్దు అని సూచించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన.. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపురాసులను పరిశీలించారు.. రైతులతో మాట్లాడుతూ.. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతుందంటూ భరోసా ఇచ్చారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది..
పదేళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగి, లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ యూటర్న్ తీసుకోబోతున్నారన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. కాషాయ కండువా వదిలేసి తిరిగి కారెక్కేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. బీజేపీ నుంచి లోక్ సభ బరిలో నిలిచిన ఆరూరి.... ఆ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో సరిగా పాల్గొనడం లేదట. బయట కూడా అంత యాక్టివ్గా తిరక్కపోవడంతో... ఇక పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటి దాకా మాజీ…
ఎమ్మెల్యే... నియోజకవర్గానికి రారాజు లాంటివాడు. అందునా అధికార పార్టీ శాసనసభ్యుడు అయితే... ఆ లెక్కే వేరు. ప్రత్యేకించి అభివృద్ధి పనుల విషయంలో తన ప్రమేయం లేకుండా చీమ చిటుక్కుమన్నా నానా రచ్చ చేసే ఎమ్మెల్యేలకు కొదవే లేదు. కానీ.... ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ పరిస్థితి మాత్రం రివర్స్లో ఉందట.
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఇక మీదట చుక్కలు కనిపించబోతున్నాయా? అంటే... అవును... జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే... అలాగే అనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. 2019 -24 మధ్య వైసీపీ తరపున పవర్లో ఉన్న బొల్లా.... ప్రత్యర్థుల్ని గట్టింగానే వేధించారని, ఇక నోటి దురద గురించి అయితే చెప్పేపనేలేదన్నది లోకల్ టాక్. అప్పటి ఆ చర్యలు, మాటలే ఇప్పుడు రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో బయటపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇబ్బందుల నేపథ్యంలో కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక లభ్యత, పారదర్శకంగా సరఫరా, అక్రమాల నియంత్రణ వంటి అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు..
తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తొలిసారి భేటీ అయ్యారు ప్రధాని మోడీ. ఇన్నాళ్ళు లేనిది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. పార్టీ టార్గెట్లో ఉన్న తెలంగాణ ప్రజా ప్రతినిధులతో సమావేశం అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈ మీటింగ్ ద్వారా ఆయన రాష్ట్ర పార్టీ కేడర్కు ఆయన ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బాపట్ల ఫార్మసీ కాలేజీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వి.సాయికిషోర్ తన విద్యార్థులతో కలిసి చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన పేటెంట్ మంజూరు చేసింది.. ప్రస్తుత ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పులపై డా కిషోర్ సాయి పరిశోధన చేశారు.. సాధారణంగా గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామున వస్తోంది. దాని కారకాలు తెల్లవారుజామున విడుదల కావడమే అందుకు కారణమని.. రాత్రి వేళల్లో కొన్ని ప్రత్యేక మెడిసిన్స్ వాడితే తెల్లవారుజామున గుండెపోటు రావనీ, తన పరిశోధనలో తేల్చారు..