* ఢిల్లీ: ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ 8వ విడత పరీక్ష పే చర్చ.. పరీక్షల సందర్భంగా ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులకు ప్రధాని సూచనలు.. దేశవ్యాప్తంగా టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఎంపిక.. వర్చువల్‌గా పాల్గొననున్న మరికొందరు టీచర్లు, విద్యార్థులు.
* నేటి నుంచి 4 రోజుల పాటు ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. ఫ్రాన్స్, అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోడీ.. నేడు, రేపు ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ టూర్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఏఐ సదస్సులో పాల్గొననున్న మోడీ.. థర్మో న్యూక్లియర్ యాక్టర్‌ను సందర్శించనున్న మోడీ.. ఫ్రాన్స్ పర్యటన తర్వాత అమెరికాకు ప్రధాని మోడీ.. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్న మోడీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకానున్న ప్రధాని మోడీ.
* బెంగళూరులో నేటి నుంచి ఈ నెల 14 వరకు 15వ ఏరో ఇండియా.. ఏరో ఇండియాలో ప్రపంచ దేశాల రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన. యలహంక భారతీయ వైమానిక దళం కేంద్రంలో ఏరో ఇండియా.. పాల్గొననున్న వివిధ దేశాల రక్షణమంత్రులు, కార్యదర్శులు, రక్షణ, సేవా రంగాల చీఫ్‌లు
* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ.. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్..
* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం.. రైతు రుణాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకర్ల పాత్రపై చర్చ.. సామాన్యులకు దగ్గరగా బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలనే దిశగా బ్యాంకర్లకు సూచనలు చేయనున్న సీఎం చంద్రబాబు.
* ఏపీ: ఇవాళ సాయంత్రం బెంగళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం జగన్.. రాత్రి 7.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న వైఎస్ జగన్
* నేడు శ్రీశైలానికి ఏపీ మంత్రుల బృందం.. శ్రీశైలంలో మహా శివరాత్రి ఏర్పాట్లపై సమీక్షించనున్న మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత, ఫరూక్, బీసీ జనార్ధన్‌రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే
* నేడు పోలవరం ప్రగతిపై కేంద్ర జలశక్తి సమీక్ష..
* హైదరాబాద్: నేడు బుద్ద భవన్ లో 5వ హైడ్రా ప్రజావాణి.. గత నెల 6వ తేదీన ప్రారంభమైన హైడ్రా ప్రజావాణి.. చెరువులు, పార్కుల కబ్జాల పై స్పందిస్తూ.. చర్యలు చేపడుతున్న హైడ్రా.. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదుల సేకరణ..
* హైదరాబాద్: నేడు జీహెచ్ఎంసీ లో ప్రజావాణి.. కమిషనర్ ఇలాంబరితి అధ్యక్షత జరగనున్న ప్రజావాణి.. జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు పాల్గొననున్న అన్ని విభాగాల అడిషనల్ కమిషనర్లు, అధికారులు.. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు సేకరించనున్న కమిషనర్..
* రాష్ట్ర పురపాలక.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* ఏలూరు: నేటితో ముగియనున్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు ప్రక్రియ .. ఇప్పటివరకు నామినేషన్ దాఖలు చేసిన 20 మంది అభ్యర్థులు. రేపు నామినేషన్ల పరిశీలన.. 13వ తేదీ వరకు నామినేషన్ లో ఉపసంహరణకు గడువు.. ఈనెల 27వ తేదీన పోలింగ్.. మార్చి మూడో తేదీన కౌంటింగ్..
* విజయవాడ: గుణదల మేరీమాత ఉత్సవాలు నేడు రెండో రోజు.. రేపటి తో ముగియనున్న ఉత్సవాలు
* విజయవాడ: రేపటి నుంచి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్ళు.. 5 రోజులపాటు జరగనున్న అమ్మవారి తిరునాళ్ళు
* తూర్పుగోదావరి జిల్లా: నేటితో ముగియనున్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ లు స్వీకరణ, రేపు నామినేషన్లు పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ, 27 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. మార్చి 3 న కౌంటింగ్.
* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి నియోజకవర్గంలో పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…
* ఏలూరు: నేడు ద్వారకాతిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాధపురం లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం.. ఉదయం 11:10కి స్వామివారి కల్యాణం..
* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి కి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ రాక… రాయచోటిలో జరిగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం లో పాల్గొననున్న మంత్రులు టీజీ భరత్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లు…
* అనంతపురం : బుక్కరాయసముద్రం కొండమీద రాయుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ గరుడ వాహనం ప్తె భక్తులకు దర్శనమివ్వ నున్న స్వామి వారు.
* కాకినాడ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్న పేరాబత్తుల రాజశేఖర్.. కాకినాడ నుంచి ఏలూరు కార్ల ర్యాలీతో బయలుదేరిన రాజశేఖర్
* శ్రీ సత్యసాయి : హిందూపురం శ్రీపేట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామి.
* అనంతపురం : గుత్తి మండలం తొండపాడు బొల్లికొండ శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి గరుడ వాహన సేవ.
* నేడు గుంటూరు కలెక్టరేట్‌లో పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, నామినేషన్ వేయనున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు…
* నంద్యాల: నేడు జూపాడుబంగ్లా తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నాయకుల ధర్నా.. బన్నూరు, చాబోలు, కొత్త సిద్దేశ్వరం గ్రామాల దళితులకు మండల కేంద్రంలో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించాలని ధర్నా..
* నంద్యాల: బనగానపల్లె (మం) యాగంటి ఉమా మహేశ్వర స్వామి క్షేత్రంలో నేడు స్వామి అమ్మ వార్లకు విశేష అభిషేక ప్రత్యేక పూజలు బిల్వార్చన, రుద్రాభిషేకం, మహా మంగళహారతి
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు జిల్లాలో కొల్లుగీత, సొండి కులాలకు కేటాయించిన మద్యం షాపులు లాటరీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కారణంగా వాయిదా వేసిన జిల్లా అధికారులు
* కర్నూలు: కోడుమూరులో శ్రీ చౌడేశ్వరిదేవి తిరునాళ్ల మహోత్సవాలలో నేడు గుమ్మటోత్సవం
* విజయనగరం: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నేడు కలెక్టరేట్ లో జరగాల్సిన గ్రీవెన్ కార్యక్రమం రద్దు…..
* నంద్యాల: మహానంది క్షేత్రంలో సోమవారం సందర్భంగా నేడు స్వామి వారికి రుద్రాభిషేకం, సాయంత్రం పల్లకి సేవ
* తిరుమల: 27 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,536 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,890 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు
* విజయనగరం: నేడు నులిపురుగుల నిర్మూలన మందు పంపిణీ.. నేడు జిల్లాలో 3.60 లక్షల మంది పిల్లలకు అల్బెండజాల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు.