దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం పర్యటన కొనసాగుతోంది.. ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్‌ను కోరారు సీఎం చంద్రబాబు.
గత ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఐదేళ్లలో అన్నీ వ్యవస్థలు భ్రష్టు పట్టాయని విమర్శించారు..పోలీసులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించటంలో గత ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.. అయితే, టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకోవాలన్నారు..
సరస్వతి భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సరస్వతీ పవర్ ప్లాన్స్ కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.. పలనాడు ప్రాంతంలో సరస్వతి పవర్ ప్లాంట్స్ కు కేటాయించిన భూముల్లో 24.85 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నట్లు గుర్తించింది అధికార యంత్రాంగం.. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అసైన్డ్ ల్యాండ్స్ కేటాయింపును రద్దు చేశారు.. ఆ భూములను వెనక్కి తీసుకోవాలని అధికారులు ఆదేశించారు..
దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముగ్గురు సీఎంలు పాల్గొన్నారు.. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు కమిషన్ ను నియమించింది. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో జ్యూడిషియల్ విచారణ జరగనుంది...
ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం మరియు ప్రధానమంత్రి-కుసుమ్ పథకాలకు సంబంధించి రాష్ట్రస్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం ఈ రోజు జరిగింది.. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ విజయానంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు సీఎస్.. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు.. ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు..
రాజధాని నిర్మాణానికి 11 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11 వేల కోట్ల రూపాయల రుణం కోసం సంప్రదింపులు జరిపాం.. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని వెల్లడించారు..
విజయవాడ రైల్వే స్టేషన్ FSSAI నుండి '5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేట్ పొందింది.. విజయవాడ రైల్వే స్టేషన్ అత్యుత్తమ పరిశుభ్రత మరియు సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి ప్రతిష్టాత్మకమైన 'ఈట్ రైట్ స్టేషన్' ధృవీకరణను పొందింది.