Deputy CM Pawan Kalyan: 15 ఏళ్ల పాటు కూటమి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలి.. అప్పుడే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. డుంబ్రిగూడ బహిరంగ సభలో మాట్లాడుతూ.. 15 ఏళ్ల పాటు కూటమి పాలన ఈ రాష్ట్రం లో కొనసాగాలి.. రాష్ట్రానికి మేలు చేసేలా చంద్రబాబు ఆలోచనలు చేస్తారు. ప్రజల్లో తిరిగి మేం కష్టాలను తెలుసుకుంటున్నాం.. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి అవ్వాలి.. అదే మా లక్ష్యం అని స్పష్టం చేశారు.. మూడు నెలలు క్రితం చెప్పాను.. ఈ రోజు సాకారం అయ్యింది. డోలి మోత తప్పాలని నిర్ణయం తీసుకున్నాను.. ఇక్కడ పర్యాటకం అభివృద్ధి అవ్వాలి అని ఆకాక్షించారు పవన్..
Read Also: Mahesh Kumar Goud: కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలలు కనడం మానండి..
గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ఏమిటి అంటే.. వైసీపీ హయాంలో మొత్తం 90 కిలోమీటర్లు రోడ్లు వేస్తే.. కూటమి 8 నెలల్లో 1069 కిలోమీటర్లు రోడ్లు వేశామని తెలిపారు పవన్ కల్యాణ్.. కూటమికి ఓట్లు వెయ్యక పోయినా.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.. రాష్ట్రం మొత్తం 3,700 గ్రామాలు ఉంటే, ఇంకా 1177 ఆవాసాలకు రోడ్లు వేయాలి.. మొత్తం 1005 కోట్లు కేటాయించారు. డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాం. ప్రజా సమస్యలు ప్రాతిపదికన ప్రాధాన్యత ఇస్తున్నాం అని వెల్లడించారు.. పెదపాడులో 12 సమస్యలు దృష్టికి తెచ్చారు వాటిని పరిష్కరిస్తాం.. కానీ, గిరిజన ప్రాంతంలో గంజాయి వ్యసనానికి లోనూ అవ్వద్దని మనవి చేశారు.. గంజాయి సాగు చేయద్దు.. రోడ్లు అభివృద్ధి చేశాక.. అంబులెన్స్‌లు గిరిజన మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నాయి.. గిరిజనుల కష్టంలో అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని హామీ ఇచ్చారు.. దేశం మొత్తం పర్యాటకులను ఆకర్షించే అరకు పర్యాటక అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేష్‌తో మాట్లాడతాను అని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Topudurthi : వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో హీరోయిన్.. వీడియోలో ఉంది నేనే కానీ?
ఇక, తన పర్యటనలో భాగంగా పెదపాడు గ్రామంలో గిరిజనులతో భేటీ అయ్యారు పవన్ కల్యాన్.. చాపురాయి దాటుకుంటూ గిరి శిఖర గ్రామానికి వెళ్ళారు.. అక్కడి ప్రజలతో గంట సేపు మాట్లాడారు. పోతంగి పంచాయతీ పరిధిలోని పెదపాడు వాసులు తెలిపిన సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమస్యలను ఆరు నెలల వ్యవధిలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు చాపురాయి ప్రాంతాన్ని పరిశీలించారు. దుంబ్రిగూడ గ్రామంలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుని.. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా చేపట్టే రహదారి పనులకి శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవితల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.. అడవిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుంది.. నీడనిస్తుందన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో డోలీ కష్టాలు చూశాం.. ఆదివాసీ గ్రామాలకు సరైన రహదారులు లేవు.. గిరిజన ప్రాంతాలకు గత ప్రభుత్వం రోడ్లు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. మన్యం ప్రాంతాల్లో రోడ్లు వేయాలని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి కోరాను.. నేను కోరిన వెంటనే రూ.49 కోట్లు మంజూరు చేశారు.. ఇక, జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.400 కోట్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..