అలెర్ట్.. మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనికోసం మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది.. ఆ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది.. కాగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది.. ఏపీకి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.. దీంతో ఏపీతో పాటు పొరుగురాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు.. ఇక, జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న మెగా డీఎస్సీ పరీక్షల్లో.. ప్రతిరోజు రెండు సెషన్లలో డీఎస్సీ నిర్వహించనున్నారు.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరగనుండగా.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.. అయితే, ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) ద్వారా నిర్వహించబోతోంది ఏపీ విద్యాశాఖ..
చంద్రబాబు స్టార్ట్ చేశారు.. దాని పర్యవసానం భయంకరంగా ఉంటుంది..!
చంద్రబాబు స్టార్ట్ చేశారు.. దాని పర్యవసానం భవిష్యత్తులో భయంకరంగా ఉంటుందంటూ కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. నెల్లూరు సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై వరుస పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు.. తప్పుడు కేసులు పరాకాష్టకి చేరాయి.. అక్రమంగా అరెస్ట్ చేస్తే.. వారు బయటికి వచ్చిన తరువాత మరింత రాటు తెలుతున్నారు.. చంద్రబాబు స్టార్ట్ చేశారు.. దాని పర్యావశనం భవిష్యత్తు లో భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు.. పోలీసులు.. తెనాలిలో ముగ్గురుని దారుణంగా కొట్టారు.. రాష్టంలో సిస్టమ్ ఫెయిలు ఐపోయింది.. పబ్లిక్ గానే బట్టలు లేకుండా డాన్సులు వేపిస్తున్నారని దుయ్యబట్టారు సజ్జల.. ఎంత అణగతొక్కాలని చూస్తే.. అంతే బలంగా వైస్సార్సీపీ పైకి లేస్తుందన్న ఆయన.. వైస్సార్సీపీలో ఉండే సీనియర్ నేతలను టార్గెట్ చేస్తారని మేం ముందే అనుకున్నాం.. చంద్రబాబుకి రాజకీయ ఉనికి లేకుండా చెయ్యాలని రాష్ట్ర ప్రజలు సిద్దమయ్యారని వ్యాఖ్యానించారు.. చంద్రబాబులో మార్పు వస్తే మేలు.. రాకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుందన్నారు.. అసలు వైఎస్ జగన్ అనుకుని ఉంటే.. చంద్రబాబుని మరోసారి జైలుకు పంపేవారని.. అయనపై అనేక కేసులు ఉన్నాయన్నారు.. లిక్కర్ కేసులో బెయిల్ మీద చంద్రబాబు.. వాటిని మేనేజ్ చేసుకుంటున్నాడు అని ఆరోపించారు.. అయితే, కేసులు భయపడేది లేదు.. అన్నిటికి సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి..
వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది.. గాలి తరహాలో జగన్ కూడా..!
గాలి జనార్దన్ రెడ్డి తరహాలో లిక్కర్ స్కామ్ లో జగన్ అండ్ కో కూడా జైలుకు వెళ్లక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలో ఇవాళ ఆయన పలు కాలనీల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ కడపలో మహానాడు అత్యంత ఘనంగా జరిగిందని 7 నుంచి 8లక్షల మంది జనం పాల్గొన్నారన్నారు. ఇది చూసిన వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందన్నారు. అందుకే వారు ఏం చేయాలో తెలియక వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావిడి చేస్తున్నారన్నారు. జూన్ 4వ తేదీన తాము విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైనింగ్ కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి, రాజగోపాల్, ఐఏఎస్ శ్రీలక్ష్మి వంటి వారు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు లిక్కర్ స్కాంలో కూడా ధనుంజయ రెడ్డి, గోవిందప్పతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు చివరకు జగన్ కూడా జైలుకు వెళ్లక తప్పదన్నారు. 2 రోజుల క్రితం సచివాలయం ఉద్యోగిని స్థానిక టిడిపి నాయకుడు ఫోన్లో దూషించిన సంఘటన మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. ఉద్యోగుల మీద ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే ఉపేక్షించేది ఉండదన్నారు. ఏ పార్టీ అయినా చర్యలు ఉంటాయన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.
చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు.. డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు..!
చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు.. డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. వైఎస్సార్ జిల్లా పేరును మార్చిన ప్రభుత్వం… NTR జిల్లా పేరు వెనుక విజయవాడను ఎందుకు చేర్చలేదు..? అని ప్రశ్నించారు.. కుచితమైన ఆలోచనలతో టీడీపీ వ్యవహరి స్తోంది అని దుయ్యబట్టారు.. ప్రభుత్వం సింగిల్ పాయింట్ అజెండా ఫాలో అవుతోంది.. చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు.. డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు అని స్పష్టం చేశారు.. ఇక, కడపలో అధికార పార్టీ డ్రామా ఎపిసోడ్ నడిపింది అంటూ మహానాడుపై సెటైర్లు వేశారు బొత్స.. ఏడాది పాలనలో ఏం చేశామో చెప్పుకోలేక ప్రజలను మభ్య పెట్టేందుకు తాపత్రయపడ్డారన్న ఆయన.. సొల్లు కబుర్లు, ఆత్మస్తుతి – పర నిందకు మహానాడు పరిమితం అయ్యిందన్నారు.. సూపర్ సిక్స్ అమలు చేయలేకపోయినందుకు మహానాడు వేదికగా ఎందుకు ప్రజలకు సంజాయిషీ ఇవ్వలేదు.. తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, పాసింగ్ రిమార్క్స్ తప్ప ఏడాదికాలంలో ఏం చేశారు.. పథకాలు ఎప్పుడు ఇస్తారో ఎందుకు చెప్పలేదు…? విద్యార్థులు భవిష్యత్ తో చెలగాటం ఈ ప్రభుత్వానికి న్యాయమా..? అంటూ మండిపడ్డారు.. పదో తరగతి మార్కులు రీ వెరిఫికేషన్ కోసం 16వేల 500మంది అప్లయ్ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు.. మా హయాంలో ఐదు వేల కంటే ఒక్కరు ఎక్కువగా కరెక్షన్ వచ్చినట్టు నిరూపించగలరా…? రికార్డులు చూడండి అని సవాల్ చేశారు.. మీరు సమీక్ష పెట్టండి నేను ప్రతిపక్ష నాయకుడు హోదాలో వచ్చి పాల్గొంటాను… బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారు.. పాత విధానం నుంచి ఎందుకు పక్కదారి పట్టించారు.. సమాధానం చెప్పాలని నిలదీశారు.. మహానాడులో టీడీపీ నాయకులు వాడిన భాష పట్ల అక్షేపిస్తున్నాం.. ఖండిస్తున్నాం అన్నారు ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ..
కాంగ్రెస్ వంద రోజులలో అరు గ్యారంటీలని అటకెక్కించింది..
కేంద్ర మంత్రి బండిసంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ళ కోసం కేంద్రం నిధులు ఇచ్చింది.. అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు ఇచ్చింది.. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని తెలిపారు.. కాంగ్రెస్ వంద రోజులలో అరు గ్యారంటీలని అటకెక్కించింది.. అరు గ్యారంటీలు అడిగినప్పుడల్లా టాపిక్ డైవర్ట్ చేస్తుందని మండిపడ్డారు.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. వరిధాన్యంకి బోనస్ ఇస్తానని సన్నధాన్యంకే బోనస్ ఇస్తుంది.. పద్దెనిమిది నెలల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, ఫార్ములా కేసు, డ్రగ్స్ ల కేసులు పత్తా లేకుండా పొయాయి.. మూటలు తీసుకెళ్ళి ఢిల్లీకి కప్పం కడుతున్నారని తెలిపారు.. రాజన్న కోడెల మరణాల విషయంపై మాట్లాడుతూ.. కోడెలని రక్షించాల్సిన బాధ్యత రాజన్న దేవస్థానందే.. కోడెలని రక్షించడానికి సరైనా ప్రణాళికలు రూపోందించాలి.. కోడెలు ఉంచే గదుల సంఖ్యలని పెంచాలని సూచించారు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులని కించపరిచే విధంగా ఉంది.. అర్మీ ఛీప్ మీద మీకు విశ్వాసం లేదా అని ప్రశ్నించారు.. పహల్గాం సంఘటన జరిగిన పదిహేను రోజులలోనే ఉగ్రవాదులని చంపాం.. ఉగ్రవాదం అంతమయ్యే వరకు యుద్ధం కొనసాగుతుంది.. అపరేషన్ సింధూర్ కొనసాగుతుంది.. పీవోకే ని కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు.
కూకట్ పల్లి అంకుర ఆసుపత్రిలో మరో దారుణం.. డెలివరీ కోసం వెళ్లిన డాక్టర్‌కి..
కూకట్ పల్లి అంకుర హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ కోసం వెళ్లిన డాక్టర్ సంధ్యకు చేధు అనుభవం ఎదురైంది. నిజంపేటకు చెందిన సంధ్య డెలివరీ కోసం అంకుర ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా ట్విన్స్ కు జన్మనిచ్చింది. ఆ తర్వాత MICU కి షిఫ్ట్ చేశారు. కాసేపటికే బాలింతకు చలి తీవ్రత పెరగడంతో కాళ్లకు హీట్ ప్యాడ్స్ కట్టారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది హీట్ ప్యాడ్స్ ను తీసేయడం మర్చిపోయారు. ఆ తర్వాత బాధితురాలికి మత్తు వదిలి స్పృహలోకి వచ్చింది. అప్పటికే హీట్ ప్యాడ్స్ కారణంగా కాళ్లకు బొబ్బలు వచ్చాయి. ఆ బాధను భరించలేక బాధితురాలు కేకలు వేసింది. అప్పటికీ గాని ఆసుపత్రి సిబ్బంది మొద్దు నిద్ర వీడలేదు. బాలింత అరుపులతో తేరుకున్న సిబ్బంది వచ్చి హీట్ ప్యాడ్స్ తీసేశారు. అప్పటికే సంధ్య రెండు కాళ్ళు బొబ్బలు ఎక్కి చర్మం ఊడిపోయింది. రెండు కాళ్లుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంకుర హాస్పిటల్ తీరుపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లో భారీగా పెరిగిన కోవిడ్ కేసులు, ఏడుగురు మృతి
భారత్‌పై మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.. దేశంలో 2,710 యాక్టివ్ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, అంతకుముందు రోజు కంటే 511 కొత్త కేసులు పెరిగాయి. కరోనా బారినపడి ఏడుగురు మరణించారు.. దీంతో, ఈ ఏడాది కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 22కి చేరుకుంది.. ప్రస్తుతం కేరళ 1,147 యాక్టివ్ కేసులతో అత్యంత ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది.. 227 కొత్త ఇన్ఫెక్షన్ల పెరుగుదల కనిపించింది. 424 యాక్టివ్ కేసులతో మహారాష్ట్ర తరువాతి స్థానంలో ఉంది, గత 24 గంటల్లో 40 కేసులు పెరిగాయి. ఢిల్లీలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించింది, 56 కొత్త కేసులువెలుగు చేశాయి.. మరోవైపు, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య కూడా పెరుదుగున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.. గత 24 గంటల్లో 255 మంది రోగులు కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. జనవరి 1 నుండి కోలుకున్న కేసుల సంఖ్య 1,170గా ఉంది. కేరళ (72), ఢిల్లీ (77), మహారాష్ట్ర (34) ఈ రోజు అత్యధికంగా కోలుకున్నారు.. మొత్తంగా కరోనా కేసులు పెరుగుల మరోసారి కలవరపెడుతోంది.. మే 25వ తేదీ తర్వాత ఏకంగా ఐదు రెట్లు పెరిగాయి కరోనా పాజిటివ్ కేసులు..
ఓరినీ.. శ్రీలీల ఎంగేజ్ మెంట్ ఫొటోల సీక్రెట్ ఇదేనా..
శ్రీలీల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆమె ఎంగేజ్ మెంట్ జరిగినట్టు ఉన్న ఆ ఫొటోలను చూసి.. ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు. నిజంగానే శ్రీలీల ఎంగేజ్ మెంట్ జరిగిందా అంటూ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఆ ఫొటోల్లో ఆమె బుగ్గలకు పసుపు పెడుతూ కొందరు ఆశీర్వదిస్తున్నారు. పైగా బిగ్ డే.. పూర్తి వివరాలు త్వరలో చెబుతా.. కమింగ్ సూన్ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే ఎంగేజ్ మెంట్, పెళ్లి అనే అనుకుంటారు. కానీ అసలు విషయం వేరే ఉంది. ఫ్యాన్స్ కు ఇది కూడా గుడ్ న్యూస్. తిథి ప్రకారం నిన్న (శుక్రవారం) శ్రీలీల పుట్టిన రోజు. అందుకే బంధువులు, ఇండస్ట్రీ నుంచి కొందరు పెద్దలను శ్రీలీల తల్లి ఇంటికి పిలిచారు. వాళ్ల సంప్రదాయం ప్రకారం ఇలా పసుపు పెట్టి ఆమెను ఆశీర్వదించారు. కాకపోతే వాటిని క్లియర్ చెప్పకుండా శ్రీలీల సస్పెన్స్ క్రియేట్ చేసిందన్నమాట. ఇది చూసిన ఆమె అభిమానులు తెగ వర్రీ అయిపోతున్నారు. ప్రస్తుతానికి శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదని ఆమెనే రీసెంట్ గా స్వయంగా చెప్పింది. కాబట్టి ఫ్యాన్స్ ఇలాంటి సస్పెన్స్ లను చూసి కంగారు పడొద్దు. శ్రీలీల తెలుగులో రెండు సినిమాల్లో చేస్తోంది. రీసెంట్ గానే రాబిన్ హుడ్ తో వచ్చినా హిట్ దక్కలేదు.
మంత్రి దుర్గేశ్ మాటలు తప్పు.. నారాయణ మూర్తి సంచలనం..
ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేయాలని చూశారంటూ మంత్రి కందుల దుర్గేశ్ చేసిన వ్యాఖ్యలు తప్పు అన్నారు. శనివారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘పవన్ కల్యాణ్ మీద ఎవరు కుట్ర చేస్తారు. వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పవన్ కల్యాణ్ ఆఫీసు నుంచి అలాంటి ప్రకటన వస్తుందని అనుకోలేదు. అది కరెక్ట్ కాదు. పర్సెంటేజీల మీద సినిమాలు రిలీజ్ చేస్తేనే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. అప్పుడు నిర్మాతలకు కూడా మంచి జరుగుతుంది. దాని కోసం థియేటర్ల బంద్ అంశం వచ్చింది. అంతే గానీ పవన్ కల్యాణ్ మీద కుట్రతో కాదు. పవన్ కల్యాణ్ ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడేందుకు అందరినీ పిలిస్తే ఆయనకు మరింత గౌరవం పెరిగేది. ఇప్పుడు సింగిల్ థియేటర్ల మనుగడ కష్టం అయిపోయింది. నేను కూడా పర్సెంటేజీ విధానమే కోరుకుంటా. చాలా మందికి ఇదే విషయం చెప్పాను. పర్సెంటేజీపై ఇప్పుడు ఓ సమాధానం దొరకుతున్న టైమ్ లో.. వీరమల్లు సినిమాకు లింక్ పెట్టడం సమంజసం కాదు. అలా చేస్తే సమస్యలు పక్కదారి పడుతాయి. సింగిల్ స్కీన్ల విషయంలో అందరం ఆలోచించాలి. అవి లేకపోతే సినిమాకు మనుగడ లేదు.
రీ రిలీజ్ ట్రెండ్ లో ఖలేజాతో మహేశ్ మరో రికార్డు..
మహేశ్ బాబు రీ రిలీజ్ ట్రెండ్ లో కూడా రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన నటించిన ఖలేజా మూవీ మే 30న రీ రిఈజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా గ్రాస్ తో వసూళ్లు సాధించింది. రీ రిలీజ్ లో రూ.5 కోట్లకు మించి వసూళ్లు చేసిన నాలుగో సినిమాగా నిలిచింది. గబ్బర్ సింగ్, మురారి, బిజినెస్ సినిమాలు ఇప్పటికే ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ఆ లిస్టులో ఖలేజా సినిమా కూడా చేరిపోయింది. అయితే గబ్బర్ సింగ్ సినిమానే డే1 కలెక్షన్లలో టాప్ లో కొనసాగుతోంది. ఆ తర్వాత మూడు సినిమాలు మహేశ్ వే కావడం విశేషం. ఖలేజా సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చింది. ఓ ఊరి సమస్యను తీర్చేంందుకు మహేశ్ ఎలా వెళ్లాడు.. ఏం చేశాడు అనేది నమ్మకాలకు లింక్ పెడుతూ త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పట్లో కలెక్షన్ల పరంగా అనుకున్నంత సాధించలేకపోయినా.. ఇప్పుడు మాత్రం మంచి కలెక్షన్లు వసూలు చేసింది.