వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.. వల్లభనేని వంశీ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.. బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు వంశీ తరుపున న్యాయవాది సత్య శ్రీ.. ఇక, ఈ కేసుకు వంశీకు ఎలాంటి సంబంధంలేదని కూడా వాదించారు..
విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్.. విజయసాయిరెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించిన ఆయన.. మొన్నటి వరకు సాయిరెడ్డి చెప్పిన పూజారుల్లో ఆయన ఒకరు కదా...? అని ప్రశ్నించారు.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత వ్యవసాయం కాదు రాజకీయం చేస్తారనేది అర్థం అయ్యింది... జగన్మోహన్ రెడ్డి కోటరీ అంటే వైసీపీ కార్యకర్తలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీలో కోటరీ ఉండదో చెప్పాలి..
కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్ బృందం.. అయితే, సిట్ నిర్ణయంతో టీటీడీ అధికారులో ఆందోళన మొదలైంది.. మార్కెటింగ్ విభాగంలో పనిచేసి ఆక్రమాలుకు పాల్పడిన అధికారులుపై చర్యలకు సిద్ధం అవుతోంది సిట్.. కల్తీ నెయ్యి కేసు విచారణను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ సిట్ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో పిటిషన్ వేశారు..
7 లక్షలకు పైగా ఇళ్లు టిడ్కోలో మంజూరు అయ్యాయి. 4 లక్షలకు పైగా ఇళ్లకు టెండర్లు పిలిచాం.. వాటిలో గత ప్రభుత్వం కొన్ని ఇళ్లు రద్దు చేసిందని మండిపడ్డారు మంత్రి నారాయణ.. కేవలం గత ప్రభుత్వం 57 వేల ఇళ్ల నిర్మాణం చేసింది.. టిడ్కో ఇళ్లలో మంచి సౌకర్యాలు ఉన్నాయి. రోడ్లు. పార్కులు. స్కూళ్లు.. షాపింగ్ కాంప్లెక్స్ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
హైదరాబాద్ యూనివర్సిటీ మరోసారి సత్తా చాటింది.. ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచింది.. 2025 ఎడిషన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో సబ్జెక్టుల వారీగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఏడు అధ్యయన అంశాలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఎంపికకావడం విశేషంగా చెప్పుకోవాలి..
విశాఖపట్నంలో ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ సంస్థకు షాక్ మీద షాక్ తగులుతోంది. సుమారు 500 కోట్ల రూపాయల విలువైన 12.5 ఎకరాలను స్వాధీనం చేసుకున్న జిల్లా యంత్రాంగం.. వాటిని 22ఏ జాబితాలో చేర్చింది. నిషేధిత భూములుగా నోటిఫై చేయడంతో రిజిస్ట్రేషన్ పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి.