Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు అయింది.. ఇప్పటికే 10 కేసుల్లో వంశీకి బెయిల్ ముందస్తు కండిషన్ బెయిల్ ను వేర్వేరు కోర్టులు మంజూరు చేశాయి.. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేయటంతో.. అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైనట్టు అయింది. దీంతో రేపు వంశీ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన వంశీ అరెస్ట్ అయ్యారు.. అప్పటినుండి జైల్లో రిమాండ్ ఖైదీ గా వంశీ ఉన్నారు. వంశీ పై అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాలు, భూ ఆక్రమణలు.. వంటి పలు ఆరోపణలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Madhusudhana Chary: తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నారని బీజేపీని నమ్ముతారు..
ఇప్పుడు అన్ని కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ రావడంతో.. వంశీ రేపు విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.. వంశీకి మైనింగ్ కేసులో మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.. దీన్ని రేపు సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. గన్నవరంలో సీతామహాలక్ష్మి అనే మహిళ భూమి ఆక్రమించారన్న కేసుకు సంబంధించి ఇచ్చిన బెయిలు రద్దు చేయాలని సీతామహాలక్ష్మి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అది త్వరలో విచారణకు రానుంది..