ఆ అధికారులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. 10 నుంచి 14 శాతానికి పెంపు..!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. అఖిల భారత సర్వీసుల అధికారులకు నేషనల్ పెన్షన్ పథకం (NPS)కింద ఇచ్చే వాటా పెంచింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏఐఎస్ అధికారులకు ప్రభుత్వం ఇచ్చే వాటాను 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో డిప్యుటేషన్‌పై ఉన్న అఖిలభారత సర్వీసు అధికారులకూ వర్తింప జేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సర్కార్.. రాష్ట్ర సచివాలయం సహా విభాగాధిపతులుగా డిప్యుటేషన్ పై ఉన్న CCS అధికారులకూ వర్తింపు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వాటా పెంపును అమలు చేయనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం… ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్.
మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లుగా ఇతర శాఖల ఉద్యోగులు.. కీలక ఉత్తర్వులు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లుగా ఇతర శాఖల ఉద్యోగుల నియామకంపై విధివిధానాలు జారీ చేసింది… ఇతర శాఖల నుంచి ఎక్కువ మంది మున్సిపల్ శాఖకు వచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో పలు నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేసింది.. పంచాయతీ రాజ్, రెవెన్యూ, స్టేట్ ఆడిట్, సెక్రటేరియట్ శాఖల నుంచి మాత్రమే మున్సిపల్ శాఖకు అనుమతి ఇస్తారు. ఇక, మాతృ శాఖలో ఐదేళ్లు సర్వీస్ తో పాటు బ్యాచిలర్ డిగ్రీ, అకౌంట్ టెస్ట్ లు పాస్, విజిలెన్స్ కేసులు లేకుండా ఉన్న వారికి మాత్రమే అర్హత ఉంటుంది. ఆయా శాఖల్లో పొందుతున్న జీతం ఆధారంగా మున్సిపాలిటీ పోస్టులకు అర్హత ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉన్న కమిషనర్, అడిషనల్ కమిషనర్ పోస్టుల్లో గరిష్టంగా 10 శాతం మాత్రమే ఇతర శాఖల వారితో భర్తీ చేస్తారు. మున్సిపల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లుగా నియమించబడిన వారికి నెల రోజుల పాటు ట్రైనింగ్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇతర శాఖల నుంచి వచ్చిన వారిని ఏ సమయంలోనైనా మాతృ శాఖకు పంపించే లా నిబంధన విధించింది ఏపీ ప్రభుత్వం..
అసలుసిసలు తెలుగు బిడ్డ పీవీ.. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం..
నేను చాలా అదృష్టవంతుడిని.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి పనిచేసే అవకాశం లభించింది అని గుర్తుచేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. పీఎం మ్యూజియంలో జరిగే “ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు” అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ క్రమంలో 6వ సంస్మరణ ప్రసంగం చేశారు.. పీవీ భారత ముద్ద బిడ్డ, భారత రత్న.. అసలుసిసలు తెలుగు బిడ్డ అని కీర్తించారు.. ఆయనతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవని గుర్తుచేసుకున్నారు.. 17 భాషల్లో పీవీ నిష్ణాతుడు.. కానీ, ప్రస్తుతం హిందీ భాష నేర్చుకోవడం పై పెద్ద రాద్దాంతం చేస్తున్నాం అని విమర్శించారు. ఎంతో సంయమనం, ఆలోచనపరమైన దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు పీవీ అంటూ కొనియాడారు చంద్రబాబు.. గతంలో భారత ఆర్ధికాభివృద్ది రేటు 3 నుంచి 5 శాతం ఉండేది.. గతంలో భారత దేశానికి చెందిన బంగారాన్ని తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఉన్నాం.. పిల్లి రంగు నలుపా, తెలుపా అనే వ్యత్యాసంతో చూడరాదు.. ఎలుకను పట్టుకునే పిల్లి అయితే చాలు అన్నారు చంద్రబాబు.. సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. సరిగ్గా అదే చేశారు పీవీ నరసింహారావు అని తెలిపారు.. 1991లో దివంగత పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణల ఫలాలను ఇప్పుడు దేశ ప్రజలంతా అనుభవిస్తున్నారు.. అన్ని పార్టీల మధ్య రాజకీయ ఏకాభిప్రాయం సాధించడంలో అసాధారణ ప్రతిభాశాలి పీవీ అంటూ ప్రశంసలు కురిపించారు చంద్రబాబు.
ప్రధాని మోడీ, అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రితో కీలక చర్చలు..
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు.. కాసేపటికే క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం ముగిసింది.. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు.. మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రి అమిత్ షాకు, కేంద్రానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు.. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు, ఆభివృద్ది కార్యక్రమాలకు ఆర్ధిక సాయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమాలోచనలు చేశారు.. ఏడాది కాలంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం.. రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థను కేంద్రం అందించిన సహకారంతో గాడిలో పెడుతున్నామన్నారు సీఎం చంద్రబాబు.. ఇప్పటికీ ఆర్ధిక వనరుల పరంగా తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమనే విషయమై సీఎం ప్రత్యేక ప్రస్తావన చేశారు.. విభజన వల్ల ఏపీ ఎదుర్కొన్న ఆర్ధిక నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేసేలా చూడాల్సిందిగా 16 ఆర్ధిక సంఘానికి నివేదించినట్లు అమిత్ షాకు వివరించారు చంద్రబాబు.. రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టు (BPLP)పై చంద్రబాబు ప్రస్తావించారట.. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వరకూ 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు వివరించారు..
ప్రసన్నకుమార్‌రెడ్డిపై హైకోర్టు సీరియస్.. మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా..?
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. అయితే, ఈ వ్యవహారంలో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది.. ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టింది హైకోర్టు.. మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటి? అంటూ మండిపడింది.. మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించింది.. అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించలేం అని స్పష్టం చేసింది.. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని మందలించింది ఏపీ హైకోర్టు.. అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండాలని హైకోర్టు హెచ్చరించింది.. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు.. మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ చేశారని తీవ్రంగా వ్యాఖ్యానించింది.. ఇక, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..
మాజీ ENC మురళీధర్ రావు అరెస్ట్.. కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు గుర్తింపు
నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ సోదాలు సుమారు 15 గంటల పాటు కొనసాగాయి. మురళీధర్ రావు నివాసమైన బంజారాహిల్స్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో వెలుగు చూసిన కోట్లాది రూపాయల అక్రమాస్తులు ఏసీబీ అధికారుల దర్యాప్తులో మురళీధర్ రావు కుటుంబానికి చెందిన భారీ స్థిరాస్తులు, విలువైన వస్తువులు వెలుగు చూశాయి. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో విల్లా, బంజారాహిల్స్‌లో ఫ్లాట్లు, యూసుఫ్‌గూడ, బేగంపేట, కోకాపేట్ ప్రాంతాల్లో స్థిరాస్తుల సమాచారం లభించింది. కరీంనగర్, హైదరాబాద్‌లలో వాణిజ్య భవనాలు, కోదాడలో అపార్ట్‌మెంట్, జహీరాబాద్‌లో 2 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ కూడా గుర్తించబడింది. 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో నాలుగు ఓపెన్ ప్లాట్లు, మోకిళ్ళలో 6,500 చదరపు గజాల భూమి, మెర్సిడెస్ బెంజ్ కారు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు సోదాల్లో బయటపడ్డాయి.
రాజ్ భవన్‌కు చేరిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్
బీసీలకు ఉద్యోగాలు, విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018లో చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణ చేస్తూ తాజా ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. 2018లో అప్పటి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 32 శాతం నుంచి తగ్గించి 22 శాతానికి పరిమితం చేస్తూ ఆర్డినెన్స్‌ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ తగ్గింపు తీరుపై అప్పట్లోనే పలువురు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. తక్కువ రిజర్వేషన్‌తో బీసీలకు నష్టం జరుగుతోందన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే విధంగా ఆర్డినెన్స్‌ను రూపొందించింది. దీనివల్ల బీసీలకు ఉద్యోగాల్లో, విద్యాసంస్థల ప్రవేశాల్లో మరింత అవకాశాలు లభించనున్నాయి. తాజా ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం లభిస్తే, ఇది తక్షణమే అమలులోకి రానుంది.
జిలేబీ, సమోసాపై వార్నింగ్ లేబుల్స్.. కేంద్రం క్లారిటీ
భారతీయులకు అత్యంత ఇష్టమైన ఆహారాల్లో జిలేబీ, సమోసాలు, లడ్డూలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో చాలా ఫేమస్ కూడా. అలాంటి ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించిందంటూ వార్తలు హడావుడి చేశాయి. సిగరెట్ పెట్టెలపై ఆరోగ్యానికి హానికరం అని రాసినట్లుగా ఆహార పదార్థాలపై కూడా వార్నింగ్ లేబుల్స్ రాసేందుకు కేంద్రం సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. ఈ మేరకు పీబీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. సమోసా, జిలేబీ, లడ్డూతో పాటు ఇతర ఆహార పదార్థాలకు వార్నింగ్ లేబుల్స్ అంటించే నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. జాతీయ మీడియా కథనాలను జత చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే ఇచ్చినట్లు కేంద్రం వివరణ ఇచ్చింది. ఎలాంటి ఆహార పదార్థాలను లక్ష్యంగా చేసుకోలేదని.. చక్కెర, నూనె శాతాలను తగ్గించాలంటూ బోర్డులు పెట్టాలంటూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. మెట్లు ఎక్కడం, వాకింగ్, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న ఆరోగ్యకరమైన భోజన పదార్థాలను తినాలని సూచించినట్లుగా తెలిపింది.
రష్యాపై భారీ దాడి చేయండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ సూచన
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. దీంతో ట్రంప్‌నకు సహనం నశించింది. ఎన్ని సార్లు చెప్పినా పుతిన్ మాట వినడం లేదని కోపం కట్టలు తెంచికొచ్చినట్లుంది. ఈ నేపథ్యంలో 50 రోజుల్లో ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపకపోతే భారీగా సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు. కానీ రష్యా మాత్రం.. ఆ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పింది. దీంతో రష్యా ఇక మాట వినదని ట్రంప్ ఒక అంచనాకు వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే రష్యాపై భారీ దాడికి ప్లాన్ చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ట్రంప్ కోరినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. అమెరికా అందించే ఆయుధాలు మాస్కోను తాకగలవా? అని జెలెన్‌స్కీని ట్రంప్ అడిగినట్లు తెలుస్తోంది. జూలై 4న పుతిన్‌తో ట్రంప్ మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ ప్రశ్న అడిగినట్లు సమాచారం.
బ్రిటన్ రాజు చార్లెస్‌ను కలిసిన టీమిండియా..!
లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా పురుషులు, మహిళా క్రికెట్ జట్లు బ్రిటన్ రాజు చార్లెస్ ను లండన్ లోని క్లారెన్స్ హౌస్ లో మంగళవారం (జూలై 15) కలిశాయి. ఈ సందర్బంగా.. రాజు చార్లెస్ భారత జట్లతో మమేకమై, లార్డ్స్ లో జరిగిన ఇంగ్లాండ్, భారత్ మూడో టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్‌లను తాను చూశానని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఐదో రోజు తొందరగా ఎనిమిది వికెట్లు కోల్పోయినప్పటికీ చివరికి కేవలం 22 పరుగుల తేడాతో ఓడిపోయిందని అన్నారు. అలాగే చివరి వికెట్‌గా మహ్మద్ సిరాజ్, షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బంతి స్టంప్స్‌కి తగిలి అవుటయ్యాడని బ్రిటన్ రాజు చార్లెస్ ప్రత్యేకంగా గుర్తు చేశారు.
ఫలితానికే కాదు… గుణపాఠాల కోసం గుర్తుండిపోతాయి కొన్ని మ్యాచ్‌లు.. సిరాజ్ ఎమోషనల్ పోస్ట్..!
ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ భారత్‌కి చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఇకపోతే, ఈ మ్యాచ్ లో చివరి వికెట్ గా బౌల్డ్ అయిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం భావోద్వేగంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. కేవలం 22 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయిన ఈ మ్యాచ్ అనంతరం, సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు. అదేంటంటే.. “కొన్ని మ్యాచ్‌లు ఫలితం కోసం కాకుండా, అవి మనకు నేర్పిన పాఠాల కారణంగా మనతోనే ఉంటాయి” అంటూ సిరాజ్ రాసిన ఈ పోస్ట్ లో తన ఎమోషన్ ను పంచుకున్నాడు. లార్డ్స్ టెస్ట్ మొత్తం హోరాహోరీగా సాగింది. రెండు జట్లు గెలుపుకోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరి రోజు లంచ్ సమయానికే ఎనిమిది వికెట్లు కోల్పోయిన భారత్, మూడో సెషన్‌లో కొంత పోరాడినప్పటికీ, చివరకు మహ్మద్ సిరాజ్ వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ ముగిసింది.
కోట శ్రీనివాస్ నుంచి నటన నేర్చుకున్నా.. జెనీలియా ఎమోషనల్.
దిగ్గజ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. సినీ ఇండస్ట్రీలో ఆయనతో పరిచయం ఉన్న వారంతా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా జెనీలియా కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. జూనియర్ సినిమాలో ఆమె కీలక పాత్రలో మెరిశారు. మూవీ ప్రమోషన్లలో జెనీలియా మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన లెజెండరీ యాక్టర్. బొమ్మరిల్లు సినిమా చేస్తున్నప్పుడు ఆయనతో నటించాలంటే కొంత భయం వేసేది. ఎందుకంటే ఆయన నటనలో సుప్రీమ్. ఆ టైమ్ లో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. యాక్టింగ్ పరంగా చాలా విషయాలు నేర్పించారు. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి మళ్లీ దొరకడు అంటూ ఎమోషనల్ అయింది.
తెలుగు హీరో డైరెక్టర్ గా ‘సంత్ తుకారాం’ జూలై 18న విడుదల
ఆదిత్య ఓం డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, హీరోగా ఎన్ని రకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నాడో అందరికీ తెలుసు! ఇప్పుడు ‘సంత్ తుకారం’ అంటూ డైరెక్టర్‌గా మరో సినిమాతో రాబోతున్నాడు. 17వ శతాబ్దంలో మరాఠీ సాధువు-కవిగా భక్తిని రిబెల్ వైబ్‌గా మార్చిన సంత్ తుకారం లైఫ్, లెగసీ, సాహిత్య రివల్యూషన్ బేస్‌తో ఆదిత్య ఓం ఈ ‘సంత్ తుకారం’ మూవీని క్రియేట్ చేశాడు. ఈ మూవీలో స్టార్ మరాఠీ యాక్టర్ సుబోధ్ భావే టైటిల్ రోల్‌లో నటించబోతున్నాడు. మరాఠీ, హిందీ సినిమాల్లో తన కిల్లర్ యాక్టింగ్‌తో అందరినీ ఫిదా చేసిన భావే, ఇప్పుడు సంత్ తుకారం పాత్రలో మ్యాజిక్ చేయనున్నాడు. ఈ సినిమా జూలై 18, 2025న వరల్డ్‌వైడ్ థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ని రీసెంట్‌గా డ్రాప్ చేశారు.