CM Chandrababu Singapore Tour: సింగపూర్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు.. రెండు రోజుల పాటు కీలక సమావేశాలు, చర్చల్లో పాల్గొన్న ఆయన.. మూడు రోజు సింగపూర్ అధ్యక్షుడు, మంత్రులు, పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు కాబోతున్నారు.. ముఖ్యంగా నేడు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు.. క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా ప్రతినిధులతో చర్చలు జరపున్నారు.. సింగపూర్ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో భేటీ కాబోతున్నారు సీఎం చంద్రబాబు.. యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
సింగపూర్ పర్యటనలో మూడో రోజూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం కాబోతున్నారు.. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు సాగనున్నాయి.. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం, మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్ తోనూ భేటీ అవుతారు.. సింగపూర్ లోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల బృందం.
Read Also: Off The Record : యనమలలో అసహనం కట్టలు తెంచుకుంటుందా..?
ఇవాళ్టి షెడ్యూల్!
* ఉదయం 7 గంటలకు యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకోనుంది.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తో పాటు పాల్గొననున్న యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్,
* గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశం.. ఉదయం 7.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం
* ఉదయం 8 గంటలకు మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచశ్రేణి కంపెనీ మురాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై తయారీ, రీసెర్చ్ యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేసే అంశంపై చర్చలు
* ఉదయం 8.30 గంటలకు ఎయిర్ కండిషనింగ్, కూలింగ్ టెక్నాలజీలో మేటి సంస్థ అయిన క్యారియర్ ప్రతినిధులతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనపై సంప్రదింపులు
* ఉదయం 9 గంటలకు ప్రపంచంలోని అతిపెద్ద అగ్రిగల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలలో ఒకటైన విల్మర్ ఇంటర్నేషనల్ సీఈఓ క్వాక్ కూన్ హాంగ్‌తో సమావేశం.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల అవకాశాలపై సీఎం చర్చ
* ఉదయం 9.30 గంటలకు షాంగ్రీలాలో జరిగే బిజినెస్ రౌండ్‌టేబుల్, నెట్‌వర్కింగ్ లంచ్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, కృత్రిమ మేధస్సు, ఫిన్‌టెక్…థీమ్‌పై చర్చిస్తారు. ఎస్‌టీటీ జీడీసీ, కాంటియర్ సిస్టమ్స్, ఆరియన్‌ప్రో, ఆంకోషాట్, వాటర్‌లీప్, జీటీఎఫ్‌ఎన్, ఫాదమ్ ఎక్స్, ఏస్ డాట్ ఎస్‌జీ తదితర సంస్థలకు చెందిన ప్రముఖుల తో రౌండ్ టేబుల్ సమావేశం
* మధ్యాహ్నం 12 గంటలకు సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ.. ఏపీకి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై సింగపూర్ భాగస్వామ్యం అంశంపై ఇరువురు నేతలు చర్చ
* మధ్యాహ్నం 1 గంటకు సింగపూర్ మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్‌తో సమావేశం.. పారదర్శక పాలన, స్మార్ట్ సిటీ అభివృద్ధిలో సింగపూర్ అనుభవాన్ని రాష్ట్రానికి అందించడంపై చర్చ
* మధ్యాహ్నం 2.45 గంటలకు జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సందర్శన.. పారిశ్రామిక వాడల్లో నివాస ప్రాంతాలు, లాజిస్టిక్స్ హబ్ ల ఏర్పాటు పై అధ్యయనం.. తర్వాత టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణుతో సమావేశం.. వాహన తయారీ రంగం, ఆటోమొబైల్ పార్కులపై చర్చ..
* అనంతరం బిజినెస్ నెట్‌వర్కింగ్ పై ఏర్పాటు చేసిన విందు సమావేశానికి సీఎం హాజరు.. ఈ సమావేశంలో అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో నూతన ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, గ్లోబల్ పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చర్చ