* నేడు సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ప్రయోగం.. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి నిసార్ ఉపగ్రహం.. ఇస్రో-నాసా సంయుక్తంగా రూపొందించిన 2,393 కేజీల నిసార్ ఉపగ్రహం..
* ఢిల్లీ: ఒకే దేశం.. ఒకే ఎన్నికపై ఇవాళ జేపీసీ సమావేశం.. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశంకానున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ
* ఢిల్లీ: నేడు జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. కమిటీ నివేదిక చెల్లదని యశ్వంత్ వర్మ పిటిషన్.. పిటిషన్ దాఖలు చేసిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
* నేడు సింగపూర్‌లో నాల్గోరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన.. వివిధ సంస్థలు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో కొనసాగనున్న చర్చలు
* అమరావతి: నేడు ఏపీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్న హోంమంత్రి అనిత
* నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 2 లక్షల 80 వేల క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3 లక్షల 13 వేలు.. 10 క్రస్ట్ గేట్లు 10 ఫీట్ల మేర.. 16 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల.. ప్రస్తుత నీటి మట్టం 587 అడుగులు.. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు.
* తిరుపతి: ఆగస్టు 8న పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం.. రేపటి నుండి టికెట్లు జారీ చేయానున్న టీటీడీ. అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న కౌంటర్లు నేరుగా టికెట్లు పోందేలా ఏర్పాట్లు..
* కడప : నేటి నుంచి జడ్పీటీసీ ఉప ఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ… జిల్లా పరిషత్ లో నామినేషన్ల దాఖలకు సర్వం సిద్ధం… ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ… జడ్పీటీసీ ఎన్నికల అధికారిగా జడ్పీ సీఈవోను నియమించిన కలెక్టర్… ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు…
* అన్నమయ్య జిల్లా : నేడు లక్కిరెడ్డిపల్లి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డి తో శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు
ములాఖాత్.. శాసనమండలి చైర్మన్ తోపాటు ములాఖాత్ కానున్న తంబలంపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానంద రెడ్డి , నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి నాగరాజు వరప్రసాద్ రాజు
.
* అనంతపురం : రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో భాగంగా ఇవాళ వైసీపీ రాప్తాడు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం. హాజరు కానున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
* అనంతపురం : ఇవాళ జిల్లాలో ప్రకటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.. నగరంలో జరిగే పలు కార్యక్రమంలో పాల్గొన్న మాధవ్.
* అనంతపురం : ఇవాళ కళ్యాణదుర్గంలో పర్యటించనున్న మంత్రి పార్థసారథి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.
* శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద.. 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.. ఇన్ ఫ్లో 2,66,325 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,82,478 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆరాధనోత్సవాలపై నేడు సమీక్ష సమావేశం.. ఆగస్టు 8వ తేదీ నుంచి ఆరాధానోత్సవాలు
* విశాఖ: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్లు దాఖలు చేసిన 21 మంది కార్పొరేటర్లు… టీడీపీ నుంచి 9, బీజేపీ నుంచి 1, వైసీపీ నుంచి 10, జనసేన 1 నామినేషన్లు.. నేడు నామినేషన్ల పరిశీలన.. ఆగస్టు 6న తేదీన ఎన్నికలు..
* నేడు మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు పర్యటన.. ఇల్లందు నుండి మధ్యాహ్నం రెండు గంటలకి బయ్యారం చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు.. కొరివి వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్న బీజేపీ రాష్ట్ర చీఫ్.. వీరభద్ర స్వామి టెంపుల్ నుండి బైక్ ర్యాలీలో మహబూబాబాద్ చేరుకోనున్న రామచందర్‌రావు.. సాయత్రం 4-15 గంటలకు బీజేపీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం
* నెల్లూరు: నేడు జరగాల్సిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలీస్ విచారణ వాయిదా.. మాజీ సీఎం జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో బందోబస్త్ లో కోవూరు పోలీసులు.. వచ్చేనెల నాలుగో తేదీన విచారణకు రావాలని కోరిన కోవూరు పోలీసులు..
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేడు కొత్తగూడెంలో రెండో రోజు పర్యటించనున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు.. కేటీపీఎస్ ఇంజనీర్ల తో సమావేశం కానున్న రామచంద్ర రావు
* రష్యాలో భారీ భూకంపం.. తీవ్రత 8.7గా నమోదు.. 2011 తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం.. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని రష్యా ప్రభుత్వం హెచ్చరిక