* నేటి నుంచి ఓవల్ వేదికగా భారత్ – ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* హైదరాబాద్: నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై సంతకం చేయనున్న చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. కాళేశ్వరం కమిషన్ నుంచి నివేదికను స్వీకరించనున్న నీటి పారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా.. కాళేశ్వరం నివేదిక స్వీకరించిన అనంతరం కమిషన్ పూర్తి స్థాయి నివేదిక సమర్పించినట్లు ధ్రువీకరించనున్న ఇరిగేషన్ సెక్రటరీ.. కాళేశ్వరం నివేదికలో ఏముందనేది సర్వత్రా ఉత్కంఠ
* హైదరాబాద్: నేడు తెలంగాణ హైకోర్టు నలుగురు కొత్త జడ్జిల ప్రమాణ స్వీకారం.. హైకోర్టులో ఉదయం 10 గంటలకు కొత్త జడ్జిల చేత ప్రమాణం చేయించనున్న చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్.. హైకోర్టు జడ్జిలుగా ప్రమాణం చేయనున్నగాడి ప్రవీణ్ కుమార్, వాకిటి రామకృష్ణా రెడ్డి, చలపతి రావు, గౌస్ మీరా మొహిుద్దీన్
* ఇవాళ మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నేత ప్రసన్న కుమార్ రెడ్డిలను పరామర్శించనున్న జగన్..
* తిరుమల: రేపటి నుంచి శ్రీవాణి దర్శన సమయం మార్పు.. రేపటి నుంచి ఆఫ్ లైన్‌లో దర్శన టిక్కెట్లు పొందిన భక్తులను సాయంత్రం 4:30 గంటలకు దర్శనానికి అనుమతి.. అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పొందిన భక్తులను ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతి.. నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్, ఆఫ్ లైన్ లో టికెట్లు పొందిన భక్తులను సాయంత్రం 4:30 గంటలకు దర్శనానికి అనుమతి
* శ్రీ సత్యసాయి : జిల్లాలో పర్యటించనున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.
* ప్రకాశం బ్యారేజి వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం.. మొత్తం 35 గేట్లను 6 అడుగుల మేర, 35గేట్లను 5 అడుగుల మేర ఎత్తిన అధికారులు.. బ్యారేజి నీటిమట్టం 12 అడుగులు.. సముద్రంలోకి 2,37,125 క్యూసెక్కుల విడుదల.. కృష్ణా తూర్పు కాలువకు 10,187 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ కాలువకు 6522 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ కు 200 క్యూసెక్కులు, మొత్తం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2,54,034 క్యూసెక్కులు
* రేపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన … జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు… జమ్మలమడుగు మండలంలోని గూడెంచెరువులో ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేయనున్న సీఎం…
* కడప : నేడు పులివెందుల జడ్పీటీసీ కి వైసీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు… పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు ఇంకా ఖరారు కానీ టిడిపి అభ్యర్థి…
* కర్నూలు : నేడు ఆదోని మునిసిపల్ కౌన్సిల్ సమావేశం…
* అనంతపురం : తాడిపత్రి కౌన్సిల్ హాల్‌లో నేడు సాదారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
* అనకాపల్లి: నేడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అనకాపల్లి పర్యటన.. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల క్యాంపు కార్యాలయానికి రానున్న నాగబాబు…
* తిరుమల: 12 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,303 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,166 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.99 కోట్లు
* మహబూబ్ నగర్ జిల్లా: జూరాలకు పోటెత్తుతున్న వరద.. 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.. ఇన్ ఫ్లో 1,82,783 వేల క్యూ సెక్కులు.. ఔట్ ఫ్లో : 1,82,575 వేల, క్యూ సెక్కులు.. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
* శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. 8 గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో 2,93,609 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 2,82,502 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులు.. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ నుండి వస్తున్న వరద.. ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు.. 18 గేట్లు 5 ఫిట్లు, 8 గేట్లు10 ఫీట్ల మేర పైకి ఎత్తి 2,49,946 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు… ఇన్ ఫ్లో 2,70,397 క్యూసెక్కులు.. మొత్తం ఔట్ ఫ్లో 2,97,110 క్యూసెక్కులు..
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో నేడు స్వామి వారి మూల బృదావనానికి తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, పుష్పర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి విశేష పూజలు… సాయంత్రం ఉత్సవ మూర్తి ప్రహ్లదరాయులకు ఉంజలసేవ, బంగారు పల్లకి, గజ వాహనం, నవరత్న స్వర్ణ రథంపై ఊరేగింపు.
* ప్రకాశం బ్యారేజి వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం.. మొత్తం 60 గేట్లను 6 అడుగుల మేర, 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తిన అధికారులు.. బ్యారేజి నీటిమట్టం 12 అడుగులు.. సముద్రంలోకి 2,49,000 క్యూసెక్కుల విడుదల.. కృష్ణా తూర్పు కాలువకు 10,187 క్యూసెక్కులు.. కృష్ణా పశ్చిమ కాలువకు 6,522 క్యూసెక్కులు.. గుంటూరు ఛానెల్ కు 200 క్యూసెక్కులు.. మొత్తం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2,65,909 క్యూసెక్కులు
* విజయవాడ: లిక్కర్ స్కాం కేసులో వరుణ్ ను ఇవాళ కూడా విచారణ చేయనున్న సిట్.. నిన్న రాత్రి 9 గంటల వరకు వరుణ్ ను విచారించిన సిట్.. వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ ఫాం హౌస్ లో 11 కోట్లు సీజ్ చేసిన సిట్
* విజయవాడ: సిట్ సీజ్ చేసిన 11 కోట్లపై నేడు ఆదేశాలు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు .. లిక్కర్ స్కాం కేసులో సీజ్ చేసిన 11 కోట్లను FDR చేయాలా లేదా కోర్టులో అందజేయాలా అనే దానిపై ఆదేశాలు ఇవ్వాలని నిన్న కోర్టులో సిట్ మెమో