జనసేన ఎంపీకీ లోక్‌సభలో కీలక పోస్టు దక్కింది.. లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు జనసేన పార్టీకి చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. అయితే, బాలశౌరికి ఈ పోస్టు కొత్త కాదు.. గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఆయన పనిచేశారు.. చైర్మన్ తో పాటు 15 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం..
తెలుగుదేశం పొలిట్‌బ్యూరో.. పార్టీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇప్పటికే పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి బీమా సదుపాయాన్ని కలిపిస్తున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని భారీగా పెంచినట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.. టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల ఖరారుపై ఓ కమిటీ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం... హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సమాచార శాఖ కార్యదర్శి, ఆర్ధిక శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, సినీ నిర్మాత వివేక్ కుచిభట్ల సభ్యులుగా ఉంటారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్లో మొదలైన కుర్చీ గోల.. ఇప్పుడు ఆ మేయర్ మెడకు ఉచ్చు బిగించిందా? ఎమ్మెల్యే మేయర్ ను టార్గెట్ చేస్తూ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాలంటూ విజిలెన్స్ కు ఫిర్యాదు చేయడం... ఇప్పుడు ఆ మేయర్ స్థానానికే ముప్పు తెచ్చి పెట్టిందా ? ఇప్పుడు కడప మేయర్‌పై వేటుతో కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి..
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌కు షాకిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మున్సిపల్ చైర్మన్ పదవి నుండి తురఖా కిషోర్ ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.. ఏపీ మున్సిపల్ యాక్ట్ లోని సెక్షన్ 16(1)(కె )ను ఉల్లంఘించినందుకు తురఖా కిషోర్‌ను మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం..
మరోసారి అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పెరిగింది.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా భూమిలో అడుగుపెడితే ఊరంతా తిప్పుతూ చెప్పుతో కొట్టానంటూ గతంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్‌రెడ్డి..
కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో సురేష్ బాబుపై అనర్హత వేటు వేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది..
టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు గుడ్‌న్యూస్ చెప్పింది బీసీసీఐ.. అసలు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఈ స్టార్ ఆటగాళ్లు గ్రేడ్ A+ కాంట్రాక్ట్‌ను కోల్పోతారా? అనే సందేహాలు వ్యక్తమవుతోన్న వేళ.. దీనిపై క్లారిటీ వచ్చేసింది.. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. T20 మరియు టెస్ట్‌ల నుండి రిటైర్ అయినప్పటికీ స్టార్ ఇండియా బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ గ్రేడ్ A+ కేటగిరీలోనే ఉంటారని స్పష్టం…