Kota Vinutha: డ్రైవర్ రాయుడు హత్యకేసులో శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ మాజీ ఇంఛార్జ్, జనసేన బహిష్కృత నేత వినుత కోటకు బెయిల్ దొరికింది.. రాయుడు హత్య కేసులో A3గా ఉన్న శ్రీకాళహస్తి జనసేన పార్టీ బహిష్కృత నేత వినుత కోటకు బెయిల్ మంజూరు చేసింది మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు.. అయితే, ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు C3 సెవెన్ వెల్స్ చెన్నై పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని షరతులు పెట్టింది కోర్టు.. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఇక, కోర్టు ఆదేశాల ప్రకారం.. నిన్న, ఈ రోజు ఉదయం 10 గంటలకు C3 సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి వెళ్లారు వినుత కోట…
Read Also: Marco Rubio: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది ట్రంపే.. శాంతి అధ్యక్షుడిగా మార్కో రూబియో బిరుదు
శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్న రాయుడు హత్య కలకలం సృష్టించింది.. గత నెల 8వ తేదీన శ్రీనివాసులు అలియాస్ రాయుడు.. డెడ్‌బాడీని చెన్నైలోని కూవం నది సమీపంలో గుర్తించారు పోలీసులు.. అతడి చేతిపై జనసేన పార్టీ సింబల్‌తో పాటుగా వినుత పేరు కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.. కేసు నమోదు చేసి ఆ దిశగా విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు వెలికి తీశారు.. విచారణలో రాయడిని హత్య చేసి నదిలో పడేసినట్లుగా నిందితులు అంగీకరించారు.. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్ కోట వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. బొక్కసంపాలెం గ్రామానికి చెందిన రాయుడు.. కోట వినుతకు డ్రైవర్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా కూడా పని చేశాడు.. అతడు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. అయితే, వినుతను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే జనసేన పార్టీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం విదితమే..