AP Free Bus Travel Scheme: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమల్లో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ నెల 15వ తేదీ నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందుబాటులోకి రానుంది… ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చెయ్యచ్చు. పల్లె వెలుగు. అల్ట్రా పల్లె వెలుగు… సిటీ ఆర్డినరీ.. మెట్రో.. ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణం చెయ్యచ్చు. ఇప్పటికే ఏపీ కేబినెట్ సమావేశంలో మహిళల ఉచిత బస్సు పథకం ఆమోదం పొందింది.. స్త్రీ శక్తి అనే పేరు పెట్టారు. అన్ని జలాల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read Also: Su from So OTT : పెట్టిన బడ్జెట్ కి డబుల్ అడుగుతున్నారు!
రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడి కైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.. రాష్ట్రం వ్యాప్తంగా 8,459 బస్సులను మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కోసం కేటాయించారు. ఏడాదికి ఈ పథకం అమలు వలన కోసం రూ.1,950 కోట్లు కేటాయించనుంది ప్రభుత్వం.. ఇక, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు చూపించి ఉచిత బస్సులో మహిళలు ప్రయాణం చేయవచ్చు.. మొన్న జరిగిన కేబినెట్ భేటీలో ఈ పథకం అమలుపై చర్చించి.. అమోదం తెలిపారు.. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు మొదలు అయ్యాయి.. జీరో ఫేర్ టికెట్ మహిళలకు ఇస్తారు.. గుర్తింపు కార్డు మాత్రం ప్రయాణ సమయంలో చూపించాలి.. ఆధార్ కార్డు.. ఓటర్ ఐడీ.. రేషన్ కార్డు.. పాన్ కార్డు కొన్ని గుర్తింపు పొందిన కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది..
Read Also: Ashish Vidyarthi : అలాంటి పాత్రలు ఇస్తేనే సినిమాలు చేస్తా.. ఆశిష్ విద్యార్థి కామెంట్స్
ఈ పథకం అమలుపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ.. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తోన్న తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పర్యటించి దీనిపై అధ్యయనం చేసింది… ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు కోసం తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసింది ప్రభుత్వం.. మహిళలు బస్సు ప్రయాణం చేసే పీక్ సమయంలో వచ్చే ఇబ్బందులు.. అదనపు బస్సులు.. సెలవు రోజుల్లో వచ్చే క్రౌడ్‌కు సంబంధించి జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.. ఇదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా సహాయం చేసే ఆలోచనలో కూడా ఏపీ ప్రభుత్వం ఉంది.
Read Also: Kota Vinutha: డ్రైవర్ హత్య కేసులో జనసేన నేతకు బెయిల్.. షరతులు వర్తిస్తాయి..!
ఈ పథకం అమలు కోసం మొత్తం ఏపీఎస్ ఆర్టీసీకి 11,500 బస్సులు ఉండగా.. 8,459 బస్సులను మహిళల ఉచిత బస్సు పథకం కోసం కేటాయించింది.. మహిళలకు, చదువుకునే మహిళా విద్యార్ధినులకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఎంతో ప్రయోజనం పొందనున్నారు.. ఈ ఏడాదికి ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 1,950 కోట్లు నిధులు ఖర్చు చేయనుంది.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొత్తగా 700 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసింది.. వచ్చే రెండేళ్లలో మరో 1400 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.. అలాగే అవసరమైన సిబ్బందిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం.