-
అమరావతి ల్యాండ్ స్కామ్.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
అమరావతి భూముల వివాదంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఆంధ్రప్రదేశ్ మైకోర్టు కొట్టివేయగా… హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేసింది… ఇక, ఈ వ్యవహారంలో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు… తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది… ఇక, ఏపీ ప్రభుత్వ ఎస్.ఎల్.పి ని కోట్టివేసింది సుప్రీంకోర్టు.. దీంతో.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు […] -
పార్లమెంట్ సమావేశాలు.. ఫ్లోర్ లీడర్లతో భేటీకానున్న ప్రధాని
పార్లమెంట్ వర్షాకాల ఇవాళే ప్రారంభం అయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనతో మొదటిరోజూ ఉభసభలు వాయిదా పడ్డాయి.. ఇక, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఉభయసభలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో రేపు సమావేశం కానున్నారు. లోక్‌సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారని తెలుస్తోంది.. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ పాలసీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.. అదేవిధంగా దేశంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై […] -
ఆ చొరవ, ఆసక్తి నిరుద్యోగులపై లేదా.. జనసేనాని ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత.. పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు.. ప్రజా సంఘాలు వీరికి మద్దతుగా నిలుస్తుండగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. నిరుద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని ప్రకటించారు.. పవన్‌ను కలిసిన నిరుద్యోగ యువత వారి ఆవేదనకు ఆయనకు తెలియజేశారు.. దీంతో, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది జనసేన పార్టీ.. రేపు ఏపీలోని అన్ని ఎంప్లాయిమెంట్ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసైనికులకు పిలుపునిస్త ఓ […] -
రాజ్యసభకు ఏపీ ప్రత్యేక హోదా సెగలు..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే రాజ్యసభలో ప్రత్యేక హోదాపై ఆందోళనకు దిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇవాళ రాజ్యసభలో వెల్‌లోకి దూసుకెళ్లారు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ఆమోదిస్తూ మార్చి 11, 2014న కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానం ఏడేళ్లు కావస్తున్నా అమలుకు నోచుకోనందున ఈ రోజు ఇతర కార్యకలాపాలను సస్పెండ్ […] -
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం.. పనులపై ఆరా
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పనులు పురోగతిపై ఆరా తీయగా… ఇవాళ మరోసారి పోలవరం డ్యామ్ సైట్‌కు వెళ్లారు.. స్పిల్వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించిన సీఎంకు.. స్పిల్‌వేపై ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు..రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో […] -
ఏపీ కరోనా అప్డేట్.. మళ్లీ పెరిగిన కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 91,594 శాంపిల్స్ పరీక్షించగా… 2,672 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు మృతిచెందారు. చిత్తూరు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున మృతిచెందగా.. అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 2,467 కోవిడ్ […] -
పంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేష్
వినాయక చవిత వచ్చిందంటే గణేష్ ఉత్సవాలు అంబరాన్ని తాకుతాయి.. ముఖ్యంగా భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలకు, నిమజ్జనానికి ప్రత్యేకస్థానం ఉంది.. ఇక, ఖైరతాబాద్‌లో కొలువుదీరే మహా గణనాథుడి విగ్రహం తయారీ నుంచి నిమజ్జనం వరకు అంతా ప్రత్యేకమనే చెప్పాలి.. ఒక్కోఏడాది ఒక్కోరూపంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నమూనాను ఇవాళే ఆవిష్కరించింది ఉత్సవ కమిటీ.. పంచముఖ రుద్ర మహాగణపతిగా భారీ గణనాథుడి దర్శనమివ్వనుండగా.. మండపంలో గణనాథుడికి ఎడమ […] -
అమెరికాలో మరో వైరస్ కలకలం.. మంకీపాక్స్ కేసు వెలుగులోకి..
కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతోన్న సమయంలోనే.. కరోనా కొత్త వేరియంట్లతో పాటు మరికొన్ని కొత్త వైర్లు కూడా వెలుగు చూస్తూ వస్తున్నాయి.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది.. టెక్సాస్‌లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా మంకీపాక్స్ వైరస్ కేసు వెలుగుచూసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది.. కొన్ని రోజుల కిందట నైజీరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి అక్కడే మంకీపాక్స్ వైరస్ సోకి […] -
అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన యూజీసీ
దేశంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీలకు ఎగ్జామినేషన్, అకాడమిక్ క్యాలెండర్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. తాజా ఆదేశాల ప్రకారం 2021- 22 విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ కోర్సులలో ప్రవేశాలను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.. అక్టోబరు 1వ తేదీ నుంచి అకాడమిక్ సెషన్ ప్రారంభించాలి.. ఒక వేళ అర్హత పరీక్షల ఫలితాలు ఆలస్యం అయితే అక్టోబర్ 18వ తేదీ వరకు తరగతులు ప్రారంభించాలని పేర్కొంది.. ఇక, ద్వితీయ […] -
ఏపీ ఎమ్మెల్సీకి తీవ్ర అనారోగ్యం.. హైదరాబాద్‌లో చికిత్స
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.. దీంతో.. హైదరాబాద్‌కు తరిలించి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. కాగా, ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు.. ఆ తర్వాత చల్లా రామకృష్ణా రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. చల్లా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. అనంతరం ఆయన భార్యా, కుమారులు, కుమార్తెలను పరామర్శించారు. చల్లా కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!