పార్లమెంట్ వర్షాకాల ఇవాళే ప్రారంభం అయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనతో మొదటిరోజూ ఉభసభలు వాయిదా పడ్డాయి.. ఇక, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఉభయసభలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో రేపు సమావేశం కానున్నారు. లోక్‌సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారని తెలుస్తోంది.. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ పాలసీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.. అదేవిధంగా దేశంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా ప్రధాని మోడీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన కల్లోలం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో తేరుకోకముందే.. మరోవైపు.. థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తొలి దశలో ఉందనే హెచ్చరికలు భయపెడుతున్నాయి.