దేశంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీలకు ఎగ్జామినేషన్, అకాడమిక్ క్యాలెండర్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. తాజా ఆదేశాల ప్రకారం 2021- 22 విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ కోర్సులలో ప్రవేశాలను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.. అక్టోబరు 1వ తేదీ నుంచి అకాడమిక్ సెషన్ ప్రారంభించాలి.. ఒక వేళ అర్హత పరీక్షల ఫలితాలు ఆలస్యం అయితే అక్టోబర్ 18వ తేదీ వరకు తరగతులు ప్రారంభించాలని పేర్కొంది.. ఇక, ద్వితీయ సంవత్సరం, ఆ పై తరగతులు వీలయినంత తొందరలో ఆన్‌లైన్/ ఆఫ్ లైన్‌లో ప్రారంభించాలి.. పరీక్షలను ఆన్ లైన్, ఆఫ్‌లైన్.. మిశ్రమ విధానాల్లో నిర్వహించాలని సూచించింది.
12వ తరగతి ఫలితాలు వెల్లడి అయ్యాకే యూజీసీ కోర్సులలో అడ్మిషన్స్ చేపట్టాలని స్పష్టం చేసింది.. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇతర బోర్డ్స్ 12వ తరగతి ఫలితాలు జూలై 31 నాటికల్లా విడుదల చేయాలని పేర్కొంది.. విద్యార్ధులు అక్టోబర్ 31 లోపు అడ్మిషన్స్ క్యాన్సల్ చేసుకుంటే మొత్తం ఫీ రీఫండ్ చేయాలని ఆదేశించిన యూజీసీ.. డిసెంబర్ 31 లోపు సీటు క్యాన్సల్ చేసుకుంటే వేయి రూపాయలకన్నా ఎక్కువ కట్ చేసుకోకుండా ఫీ అంతా రీఫండ్ చేయాలని పేర్కొంది.. మరోవైపు వచ్చే ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది.