కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జోనల్ వ్యవస్థలో మార్పులకు ఈ ఏడాది ఏప్రిల్ 19న రాష్ట్రపతి ఆమోదం తెలియజేయగా.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది.. తద్వారా జోనల్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేసింది.. ఇప్పటి వరకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినందున ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ కొత్త జోనల్ విధానం వర్తింపజేయనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలకు తోడు స్థానికులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం జోనల్ వ్యవస్థలో మార్పులుచేసింది. గతంలో ఉన్న రెండు జోన్లను ఏడు చేసింది. కొత్తగా రెండు బహుళ జోన్లను ఏర్పాటు చేసింది. మొదటి నాలుగు జోన్లను ఒక బహుళ జోన్‌లో, మిగిలిన మూడు జోన్లను రెండో బహుళ జోన్‌లో చేర్చింది… దీనిపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.. నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో స్థానికులకే ఉద్యోగాలన్న ఆయన.. నూతన జోనల్ వ్యవస్థను ఆమోదించిన సీఎంకి, ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు దక్కుతాయన్న ఆయన.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అవకాశాలు ఉంటాయన్నారు.. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేశారు.. ప్రభుత్వ, ప్రైవేటు రంగం రెండిటిలో స్థానికులకే సింహభాగం ఉద్యోగాలు దక్కాలన్న స్ఫూర్తితో పనిచేస్తున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్.
Also Read
- Tags
- Zonal System
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!