భారత్‌తో కరోనా మహమ్మారి సేకండ్‌వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. దీంతో.. కోవిడ్ కట్టడికి వివిధ రాష్ట్రాలు కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి.. కేసుల తీవ్రతను బట్టి కొన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు.. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు.. తాజాగా మరో రాష్ట్రం ఈ జాబితాలో చేరింది.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం కరోనా కట్టడి కోసం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ వారం నుంచి కరోనా మహమ్మారి ప్రభావం తగ్గేవరకు ప్రతి […]
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఓ కరపత్రం ఇప్పుడు కాకరేపుతోంది.. ఈ వ్యవహారంతో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది.. ప్రజాప్రతినిధులు డబ్బులు అడుగుతున్నారంటూ రిలీజ్ అయిన పాంప్లెట్ ఇప్పుడు వరంగల్ లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ కరపత్రాలు హల్చల్ చేస్తున్నాయి.. వివరాల్లోకి వెళ్తే.. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు.. రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ ఓ కరపత్రం […]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వివేకా హత్య సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీవీ ఈ కేసు విచారణలో సీబీఐ అచేతనత్వంతో ఉందని.. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి లేదని సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే కాగా.. వివేకా హత్యకేసు సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపానని.. అయినా స్పందించలేదని పేర్కొన్నారు.. […]
కరోనా బాధితుల చికిత్సలో ఆక్సిజన్ పాత్ర కీలకమైనది.. కరోనాబారిన పడి ఆస్పత్రి చేరాడంటేనే ఆక్సిజన్ తప్పనిసరి.. అయితే, వరుసగా కేసులు పెరగడం.. క్రమంగా ఆస్పత్రులకు తాకిడి పెరగడంతో.. ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది.. దీంతో.. ఆస్పత్రులు, అంబులెన్స్‌లు సైతం ఆక్సిజన్ ఏజెన్సీల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. విజయవాడలో గత నాలుగు రోజులుగా ఆక్సిజన్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది.. మరో మూడు రోజుల్లో నగరంలో నిల్వ ఉన్న ఆక్సిజన్ మొత్తం అయిపోతుందని చెబుతున్నారు ఆక్సిజన్ సప్లేయర్స్.. […]
కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అంతా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్‌లు చేయించుకున్నారు.. అయితే, […]