తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరిని పొమ్మనకుండానే పోయేలా చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు స్వామిగౌడ్… మాజీమంత్రి ఏ. చంద్రశేఖర్ నివాసంలో కొందరు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు.. స్వామిగౌడ్, యెన్నం శ్రీనివాసరెడ్డి, గాదె ఇన్నయ్య, బెల్లయ్య నాయక్, కపిలవాయి దిలీప్ కుమార్, బండి సదానంద్, రాములు నాయక్, రాణి రుద్రమ్మ తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశ్యంతో సాధించుకున్నామో ఆ విధంగా కలలు సహకారం కావడంలేదన్నారు.. ఉద్యమంలో […]
భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.. ఒకే రోజు దేశ్యాప్తంగా 86 లక్షలకు పైగా డోసులు వేసిన కొత్త రికార్డు సృష్టించిగా.. దీనిపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి భారత దేశం చరిత్ర సృష్టించిందన్నారు.. వ్యాక్సిన్ తీసుకోవడంపై అను అనుమానాలను అధిగమించాలని పిలుపునిచ్చారు… మహమ్మారిపై […]
గోరేటి వెంకన్న రాసిన గల్లీ చిన్నది పాటను ఎన్నో సందర్భాల్లో గుర్తుచూస్తేనే ఉంటారు తెలంగాణ సీఎం కేసీఆర్… వెంకన్న ఆ పాటలోని దళిత బస్తీల్లో కొరవడని సౌకర్యాలను వివరించారు.. మరోసారి ఆ పాటను గుర్తుచేశారు.. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం విధివిధానాల రూపకల్పనపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగింది.. మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో […]
తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలని పిలుపునిచ్చారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. విశాఖలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను చాటుకునేందుకు సంఘటితంగా ముందు సాగుదామన్నారు.. మన భాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడంతో పాటు ఇతరుల భాషా సంస్కృతులను గౌరవించాలన్నారు.. మనుషులనే గాక, తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉందన్నారు. ఆచార […]
సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి ప్రగతిభవన్ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.. అయితే, ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాట్టు బీజేపీ ప్రకటించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరు కావడం పెద్ద చర్చగా మారింది.. దీనిపై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్పందించారు.. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ నిర్ణయంపై మోత్కుపలి కి […]
మంత్రి ముద్దు వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది.. చివరకు ఆయన పదవినే ఊడగొట్టే వరకు వెళ్లింది..! ఏంటి ముద్దుతో పదవులు కూడా పోతాయా? అనే అనుమానం కలుగొచ్చు… నిజమేనండి.. పూర్తి వివరాల్లోకి వెళ్లి పరిశీలిస్తే.. యూకే ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్.. తన సహాయకురాలికి కార్యాలయంలో ముద్దు పెట్టారు… ఈ ముద్దు భాగోతాన్ని సన్ వార్తాపత్రిక ప్రముఖంగా ప్రచురించింది.. అయితే, దీనిపై పెద్ద దుమారమే రేగింది.. హాంకాక్ ఆ ఘటనపై ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వివరణ ఇవ్వడంతో.. […]
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరుగుతోన్న అఖిలపక్ష సమావేశంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి ప్రగతిభవన్‌లో అఖిలపక్ష భేటీ ప్రారంభం కాగా.. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు, సీపీఐ, సీపీఐ నేతలకు, ఇక, దళిత నేతలు, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర నాయకులకు ఆహ్వానాలు వెళ్లాయి.. ఈ భేటీకి […]
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది… సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు, సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి సీనియర్ దళిత నేతలు, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులకు ఆహ్వానాలు వెళ్లగా.. ఈ సమావేశానిక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, […]
కరోనా సెకండ్ వేవ్ భయాలు ఇంకా తొలగిపోకముందే.. మరో కొత్త వేరియంట్ కలవరపెడుతోంది.. అదే కరోనా డెల్టా ప్లస్ వేరియంట్.. ఇప్పటి వరకు ఉన్న కోవిడ్ వేరియంట్లలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే, దీని వ్యాప్తిని అడ్డుకోవాలంటే మాత్రం వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇక, భారత్ ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తోంది.. కానీ, కరోనా టీకాలు తీసుకోనివారిలో […]
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా.. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది… ఇప్పటికే భారత్‌లో కొత్తి వేరింట్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 10 దాటేసింది… ఈ కేసులు వెలుగుచూసిన రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది కేంద్రం.. మరోవైపు.. మహారాష్ట్రలో డెల్టా కేసులు పెరుగుతున్న తరుణంలో కర్ణాటక – మహారాష్ట్ర సరిహద్దుల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.. పోలీసు, వైద్యశాఖ సంయుక్తంగా చెక్‌పోస్టు ఏర్పాటు చేసింది.. ఇక, మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి వచ్చేవారికి […]