ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్.. సమర్థించిన సీఎం, ఎవరూ అతీతులు కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ సీఎం తండ్రిపై కేసు నమోదు కావడమే సంచలనంగా మారగా.. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం చర్చగా మారింది.. ఇక, ఆ అరెస్ట్‌ను సీఎం సమర్థించారు.. చట్టం ముందు సమానులేనని స్పష్టం చేశారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్ తండ్రి నంద్‌కుమార్ బఘెల్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. బ్రహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. చత్తీస్‌గఢ్ పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేశారు. బ్రహ్మణ సంఘం నేతల ఫిర్యాదుతో నంద్‌కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు రాయ్‌పూర్ కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
కాగా, నంద్ కుమార్ బఘెల్ తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. బ్రాహ్మణులు రాయ్‌పూర్‌లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులు బయటివారనీ.. విదేశీయులనీ.. వారు తమను తాము సంస్కరించుకోవాలని… లేదంటే గంగ నుంచి వోల్గాకు వెళ్లడానికి సిద్ధం కావాలని నంద కుమార్ వ్యాఖ్యానించినట్టు బ్రాహ్మణ సమాజం నేతలు ఆరోపించారు. దీంతో, రాయ్‌పూర్ పోలీసులు నంద కుమార్ బాఘెల్‌పై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. సమాజంలో నందకుమార్ విద్వేషాలను వ్యాపింపజేస్తున్నారని.. ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని బ్రాహ్మణులు.. తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇక, తండ్రి నంద కుమార్ అరెస్టుపై స్పందించారు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్.. తన తండ్రి అంటే గౌరవం ఉందన్న సీఎం.. తన ప్రభుత్వంలో ఎవరూ చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు. ఓ కుమారునిగా తన తండ్రిని గౌరవిస్తాననీ… కానీ, ప్రజా భద్రతకు భంగం కలిగించేలా ఉన్న ఆయన పొరపాట్లు ఉపేక్షించరానివని చెప్పారు.
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!