టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టిస్తున్నా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఈ కేసులో ఇప్పటికే రంగంలోకి దిగిన ఈడీ.. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు.. ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ.. వారి బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తూ వస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వచ్చింది.. డ్రగ్స్ కేసుకు మూలంగా ఎఫ్ కేఫ్ లాంజ్ మారింది.. ఎఫ్ కేఫ్ లాంజ్ కేంద్రంగా సినీస్టార్స్ కు డ్రగ్స్ సరఫరా అయినట్టు భావిస్తున్నారు.. ఎఫ్ కేఫ్ లాంజ్ ను సెంటర్‌గా చేసుకున్న కెల్విన్.. సినీ తారలకు అక్కడే డ్రగ్స్ సప్లై చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక, ఎఫ్ కేఫ్ లాంజ్‌లో డ్రగ్స్ పార్టీలపై 2017లో దృష్టి సారించింది ఎక్సైజ్ శాఖ.. ఎఫ్ కేఫ్ లాంజ్ పార్టీల ఆధారంగా 2017లో తెర మీదకు టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వచ్చింది.. అదే ఎఫ్ కేఫ్ లాంజ్ వేదికగా జరిగిన డ్రగ్స్ పార్టీ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.. డ్రగ్స్ పార్టీలో మత్తు కోసం జరిగిన లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది.. ఇప్పటికే ఎఫ్ కేఫ్ లాంజ్ మేనేజర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.. సెప్టెంబర్ 13న ఈడీ ఎదుట హాజరు కావాలంటూ ఎఫ్ కేఫ్ లాంజ్ జనరల్ మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేసింది.. అయితే, 2017లో డ్రగ్స్ కేస్ తెర మీదకు వచ్చిన తర్వాత ఎఫ్ కేఫ్ లాంజ్‌ను మూసివేసింది యాజమాన్యం.. అది సినీ నటుడు నవదీప్‌కు సంబంధించిందిగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇదే ఎఫ్ కేఫ్ లాంజ్ నుండి కెల్విన్ అండ్ కో డ్రగ్స్ డీలింగ్స్ చేసినట్టుగా గుర్తించారు.. ఇదే ఎఫ్ కేఫ్ లాంజ్ వేదికగా రకుల్, రానా, రవితేజ తదితరలు పార్టీలకు కూడా హాజరైనట్టు చెబుతున్నారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
- Tags
తాజావార్తలు
-
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్‌గా మారిన వీడియో
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
-
Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!