బండ్ల గణేష్‌కు జీవిత కౌంటర్: టైం వేస్ట్.. చీప్ ట్రిక్స్.. డోంట్ కేర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన బండ్ల గణేష్.. ఆ తర్వాత ప్రకాష్ రాజ్‌కు షాక్ ఇచ్చారు.. ప్యానల్ నుంచి బయటకు వచ్చి మా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.. అంతే కాదు.. జీవిత రాజశేఖర్.. ప్రకాష్ రాజ్ ప్యానల్‌లోకి రావడం తనకు ఇష్టం లేదన్న బండ్ల.. అందుకే ప్యానల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి కాక రేపారు.. జీవితపైనే తాను పోటీ చేస్తానని వెల్లడించారు.. ఆమె మెగా ఫ్యామిలీని ఎన్నోసార్లు కించపరిచారంటూ పాత గొడవలను కూడా తవ్వాడు.. అయితే, బండ్ల గణేష్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జీవిత రాజశేఖర్..
బండ్ల గణేష్ అంటే నాకు డోంట్ కేర్ అంటూ ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రస్తావించిన ఆమె.. బండ్ల గణేష్ గురించి మాట్లాడడం టైం వేస్ట్.. ‘మా’ గురించి మాట్లాడకుండా చిరంజీవి ఇష్యూ ఎందుకు మాట్లాడడం? అని ప్రశ్నించారు. బండ్ల గణేష్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.. నా బతుకు గురించి బండ్ల గణేష్‌కు ఎందుకు? నేను పార్టీలు మారితే మీకు వచ్చిన నష్టం ఏంటి? నేను రాజకీయ పార్టీలు మారితే బండ్ల గణేష్‌కు వచ్చిన కష్టమేంటి..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన జీవిత.. పార్టీలు మారడం అనేది నా ఇష్టం అన్నారు.. ఒకే పార్టీలో ఉండి వెనక గోతులు తవ్వితే గొప్పోడా అంటూ ప్రశ్నించారు. మా ఆస్తులు అమ్ముకొని చేతనైనంత సహాయం చేశామన్న ఆమె.. మెగా ఫ్యామిలీని చాలా మంది విమర్శించి ఉంటారు.. వాళ్లందర్నీ వెలివేస్తారా? అంటూ నిలదీశారు. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో జీవిత రాజశేఖర్ ఏం మాట్లాడారో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
Also Read
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!