ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం హీట్ పెంచుతోంది… ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో జల వివాదంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్న పవన్.. ఇద్దరు […]
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అందులో భాగంగా జనసేన పార్టీ కమిటీలను ప్రకటించారు. ఐదుగురిని ప్రధాన కార్యదర్శులుగా.. 17 మందిని కార్యదర్శులుగా.. 13 మందిని సంయుక్త కార్యదర్శులుగా నియమించారు.. ఇక, 9 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను కూడా ప్రకటించారు జనసేనాని.. మరోవైపు.. ఐటీ, డాక్టర్స్, చేనేత, మత్స్యకారులు, లీగల్ విభాగాలను ఏర్పాటు చేసి.. వాటికి అధ్యక్షులను నియమించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లను పరిశీలిస్తే.. కృష్ణా జిల్లా – […]
కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రమోషన్ అందుకున్న జి కిషన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు.. నాపై విశ్వాసం ఉంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.. ప్రధానమంత్రి అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తానన్న ఆయన.. నాకు మార్గదర్శనం చేసి మద్దతుగా నిలిచిన అమిత్ షాకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అమిత్ షా శిక్షణలో క్రమశిక్షణతోపాటు చాలా విషయాలు తెలుసుకున్నాను.. వారికి కృతజ్ఞుడనై ఉంటానని..బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు ఇతర […]
ఇప్పటి వరకు సహాయ మంత్రిగా పనిచేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్ వచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కింది.. ఇవాళ రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కిషన్‌రెడ్డి.. కాగా, సికింద్రాబాద్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన కిషన్ రెడ్డిని.. కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సహాయకుడిగా సహాయ మంత్రిత్వశాఖను కిషన్ రెడ్డికి అప్పగించారు. విధి నిర్వహణలో కీలకంగా వ్యవహరించి ఇద్దరి […]
క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు ఎస్సార్ గ్రూప్ ప్రతినిధులు.. సీఎంను కలిసిన వారిలో ఎస్సార్ గ్రూప్ హెడ్ ప్రశాంత్ రుయా, వైస్ ఛైర్మన్ జె మెహ్రా, ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఉన్నారు… ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూపు సన్నద్దత వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది.. వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్సార్ గ్రూపు.. ఈ ఏడాది నవంబర్‌లో స్టీల్ ప్లాంట్ పనులుకు శంకుస్ధాపన చేసేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. తొలిరోజే.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరును ప్రస్తావించారు.. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పీకేను సలహాదారుగా పెట్టుకోవాలి అని కొందరు మిత్రులు సలహా ఇస్తున్నారు.. కానీ, తెలంగాణలో ఉన్న ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఓక పీకేయే నని.. ఇంత మంది పీకేలు ఉండగా.. మనకు పీకే అవసరమా..? అని ప్రశ్నించారు.. ఇక, సోనియా, రాహుల్ గాంధీలకు […]
వైఎస్సార్ లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు ఈ అవార్డులకు ఎంపిక చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమ్యూనికేషన్ల సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ ఈ అవార్డుల జాబితాలను ప్రకటించారు. మొత్తంగా వివిధ రంగాలకు చెందిన 63 మందికి అవార్డులు ఇవ్వనున్నారు.. వివిధ రంగాల్లోని ఎనిమిది సంస్థలకు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డులు దక్కగా.. రైతు విభాగంలో కడియం […]
కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సమయంలో మంత్రివర్గంలోని సీనియర్లకు షాక్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ… కొత్తవారికి అవకాశం ఇస్తూనే.. కొందరు పాతవారికి ప్రమోషన్లు ఇచ్చిన ప్రధాని.. ఏకంగా 12 మంది కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించడం సంచలనంగా మారింది.. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా తమ పదవులు కోల్పోయారు.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, సంతోష్ గాంగ్వర్, […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… 2015లో జరిగిన ఘర్షణ కేసులో తీర్పు వెలువరించిన కోర్టు.. దానం నాగేందర్‌కు వెయ్యి రూపాయాలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.. 2015లో జరిగిన ఘర్షణ కేసులో ఇవాళ హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ మరియు ఎమ్మెల్యేల స్పెషల్ సెషన్ కోర్టులో విచారణ జరిగింది.. యూ/ఎస్ 323,506 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ ప్రకారం బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ పూర్తి […]
తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ మరింత ముదురుతూనే ఉంది… ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, కేఆర్ఎంబీకి లేఖలు రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.. పదేపదే కేంద్ర జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా.. వివాదాలు పరిష్కారం కావటం లేదని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ అక్రమంగా వాడేస్తోందని దీనిని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని కోరారు.. ఉమ్మడి […]