పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బీజేపీ.. ఏడీఆర్ నివేదిక వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ ఫిరాయింపు దారులను బీజేపీ ప్రొత్సాహిస్తుందని అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫార్మ్స్ తన అధ్యయనంలో వెల్లడించింది. 2014 నుంచి 21 మధ్య దేశ వ్యాప్తంగా 173 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వివిధ పార్టీల నుంచి కాషాయ కండువా కప్పుకునట్లు తెలిపింది. అంతేగాక వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన 253 మంది అభ్యర్ధులు బీజేపీ తీర్థం పుచుకున్నట్లు ఏడీఆర్ నివేదికలో వెల్లడించింది. గత ఏడేళ్లలో పార్టీ ఫిరాయింపులతో అత్యధికంగా బీజేపీ లాభపడగా, ఎక్కువగా నష్టపోయిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది.
దేశ వ్యాప్తంగా 500 మంది ఎంపీలు ,ఎమ్మెల్యేలు ఒక వెయ్యి 133 మంది ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ మారినట్లు ఏడీఆర్ తన సర్వేలో గుర్తించింది. అత్యధికంగా కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన 222 మంది అభ్యర్థులు పార్టీ మారినట్లు తెలిపింది. అలాగే బీఎస్పీకి చెందిన 153 మంది అభ్యర్ధులు, 20 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అంతేగాక బీజేపీకి చెందిన 111 మంది అభ్యర్ధులు, 33 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కండువా మార్చారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించినా వారిలో టీడీపీ నుంచి 32 మంది ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు, 26 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారారు. టీఆర్‌ఎస్ నుంచి నలుగురు అభ్యర్ధులు నలుగురు ప్రజాప్రతినిధులు వేరే పార్టీలో చేరారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా టీఆర్‌ఎస్‌లోకి 30 మంది చేరగా, వైసీపీలోకి 24 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి చేరారు.
Also Read
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..