తెలుగు అకాడమీ పేరును మార్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తెలుగు అకాడమీ పేరును.. తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం… ఇక, అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో నలుగురిని నియమించింది సర్కార్… తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డి. భాస్కర రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య అధ్యాపకుడు డాక్టర్ నెరేళ్ల రాజ్‌కుమార్, గుంటూరు జేకేసీ కాలేజీ తెలుగు రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం విజయశ్రీ, ఎస్ఆర్ఎస్వి బీఈడీ కాలేజికి చెందిన లెక్చరర్ కప్పగంతు […]
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు.. కొత్తగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాన్సుఖ్ మాండవియాను కలిసిన ఆయన శుభాకాంక్షలు తెలియజేవారు.. ఈ సందర్భంగా బీబీ నగర్ అఖిల భారత విజ్ఞాన సంస్థలో మూడవ బ్యాచ్‌లో ప్రవేశం చేసే విద్యార్ధులకు అవసరమగు ఇంఫ్రాస్ట్రక్చర్ మరియు ఇతర వనరులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని.. తర్వాత ఆ మంత్రిత్వ శాఖకు చెందిన సెక్రటరీని కూడా కలిసినట్టు […]
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో దీదీని తిరిగి సీఎం పీఠం ఎక్కిన పీకే.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయన దీదీతో సుదీర్ఘ మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. మమత బెనర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర […]
పాల ధరలను మరోసారి పెంచేసింది మదర్ డెయిరీ.. ఢిల్లీ-ఎన్సీఆర్ నగరంలో మదర్ డెయిరీ లీటరు పాలపై 2 రూపాయలు చొప్పున పెంచుతూ ఇవాళ నిర్ణయంతీసుకోగా… పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.. అన్ని రకాల పాలకు పెరిగిన ధరలు వర్తిస్తాయని పేర్కొంది మదర్ డెయిరీ.. ధర పెంపుకు కారణం ఖర్చులు పెరగమే అంటోంది మదర్ డెయిరీ.. 2019లో పాల ధరలు పెంచగా.. కరోనా మహమ్మారి సమయంలో.. పాల సేకరణ, ప్రాసెస్, ప్యాకింగ్, రవాణ ఖర్చులు […]
కరోనా మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, కుదిరితే ఎక్కువ సార్లు చేతలను శుభ్రం చేసుకోవడం.. లేని పక్షంలో శానిటైజర్ వాడాలని వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు.. దీంతో.. క్రమంగా శానిటైజర్ వాడేవారి సంఖ్య పెరుగుతూ పోతోంది.. అయితే, శానిటైజర్ వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా లేకపోలేదు.. తాజాగా.. తమిళనాడులో శానిటైజర్ కారణంగా మంటలు అంటుకొని పసివాడు బలయ్యారు.. తిరుచ్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 13 […]
జనాభాలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.. క్రమంగా జనాభా పెరిగిపోతూనే ఉంది… కొన్ని రాష్ట్రాల్లో జనాభా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.. ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాలంటే.. సంతానాన్ని కూడా అర్హతగా పెట్టారు.. తాజాగా, జనాభా నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. త్వరలోనే కొత్త చట్టాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటికే ముసాయిదాను తయారు చేశారు.. దాని ప్రకారం.. ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు సంతానంగా ఉన్నవారు ప్రభుత్వ […]
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ ఆఫీసర్ జీపీ సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు ఛత్తీస్‌ఘడ్ పోలీసులు.. అక్రమాస్తుల కేసులో జీపీ సింగ్‌ను గత వారమే సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.. అయితే, ఆయన ఇంట్లో సోదాల సందర్భంగా.. ఏసీబీ, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌కు కొన్ని కీలకమైన కాగితాలు దొరికాయి.. రెండు వర్గాల మధ్య విబేధాలు సృష్టించేలా.. శతృత్వాన్ని పెంచేలా.. ఘర్షణలకు దారితీసేనలా.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంపై కుట్ర పనినట్టు ఆరోపిస్తున్న పోలీసులు.. జీపీ […]
తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కిటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. కిటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం ఇవాళ తెలంగాణలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై హైదరాబాద్ చేరుకున్న కంపెనీ ఎండీ సాబు జాకబ్, ఇతర సీనియర్ ప్రతినిధి బృందం… మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను కేటీఆర్ వారికి వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో అనుమతులు, తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, […]
తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేస్తారన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్‌లా తనకు గాలివాటంలా ఉద్యోగం రాలేదని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. పొత్తులో కేటీఆర్ కి టికెట్ ఇచ్చినప్పుడు ఎంతకి కొన్నారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ అన్నారు. అలాగే ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్ ప్రభుత్వంలో హరీష్‌రావు మంత్రి అయ్యారన్నారాయన. హరీష్‌రావు బతుకే కాంగ్రెస్ అని.. టీడీపీని విమర్శిస్తూనే […]
తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా నాయకత్వాలు, పార్టీల పాత్రలూ ప్రవేశ నిష్క్రమణలూ జరగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటి ప్రభావం ఎలా వుంటుందనేదానిపై ఎవరి అంచనాలు వారికి వుంటాయి గాని మార్పు తథ్యం. పైగా ఇవన్నీ ఒకటి రెండు రోజుల తేడాతో జరగడం మరీ విశేషం. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీసీసీ పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. చాలా కాలం తర్వాత గాంధీ భవన్ కళకళలాడింది. ఆ మరుసటి రోజునే వైఎస్ జయంతి […]