వివాదాస్పదమైన ప్రైవసీ పాలసీని వాట్సాప్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్, భారత రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో దీనిని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే వినియోగదారులు ఈ పాలసీని అంగీకరించాలని ఒత్తిడి చేయబోమని తెలిపింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు వచ్చేవరకు తాము దీన్ని అమలు చేయమని.. హైకోర్టుకు తెలిపింది. ఒకవేళ బిల్లు దీన్ని అనుమతిస్తే.. అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తామని వాట్సాప్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. వాట్సాప్ కొత్త […]
ఏపీ విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ఘనంగా ప్రకటించబడిన పోలవరం కేంద్రం వివక్షతో సమస్యాత్మకంగా నడుస్తుంటే జరిగినమేరకు పనులు కూడా ప్రజల పాలిట ప్రాణాంతకమవుతున్నాయి. పెరిగిన వ్యయాన్ని లెక్కలోకి తీసుకోకపోవడం ఒకటైతే ప్రాథమిక సూత్రమైన సహాయ పునరావాస కార్యక్రమాలకు బాధ్యత లేదని దులిపేసుకోవడం కేంద్రం చేస్తున్న దారుణం. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పునరావాసపనులు సరిగ్గా జరగలేదని తాము అధికారంలోకి రాగానే పటిష్టంగా ఆదుకుంటామని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పదేపదే ప్రకటించారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో స్వయంగా […]
భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. ఆమె ఆరోగ్యంపై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు గుప్పిస్తోంది. అనారోగ్యం కారణంగా మాలెగావ్ పేలుళ్ల విచారణకు హాజరుకాలేనని చెబుతున్న ఆమె.. పెళ్లి వేడుకలో డ్యాన్సులు చేయడంపై మండిపడుతున్నారు. అయితే, ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. ఇద్దరు పేదింటి యువతులకు తన ఇంట్లోనే వివాహం జరిపించారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఎంపీ కూడా డ్యాన్స్ చేశారు. ఈ […]
బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో… ఏపీలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆదివారం, సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కవ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఓ మోసర్తు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.. దీనికి అల్పపీడనం తోడు […]
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న పలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలను విడుదల చేశారు.. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను ఇవాళ విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించారు.. ఈఏపీసెట్‌ను కాకినాడ జేఎన్టీయూ ఆగస్టు 19-25 తేదీల్లో నిర్వహించనుండగా.. ప్రొ. రామలింగరాజు ఛైర్మన్‌గా.. ప్రొ. రవీంద్ర కన్వీనర్ ఉంటారు.. ఈసెట్‌ను సెప్టెంబర్ 19న అనంతపురం జేఎన్టీయూ నిర్వహించనుండగా.. ప్రొఫెసర్ జి. రంగనాథం ఛైర్మన్‌గా, […]
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మునిగిపోయారు. ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. గుప్తార్ ఘాట్‌లో వద్ద స్నానాలు వెళ్లిన సమయంలో… వారంతా నీట మునిగిపోయారు. ఇంకా ఆరుగురి జాడ తెలియలేదు. గజ ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఏడేళ్ల బాలిక నీటిలో ఈదుకుంటూ వచ్చి ప్రాణాలను కాపాడుకుంది. రక్షించిన వారిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితులంతా ఆగ్రాలోని […]
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మొదటి దశలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పారు. నూతన జోనల్ విధానానికి అడ్డంకులు తొలగడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇక ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను గుర్తించి రెండో దశలో భర్తీ చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని చెప్పారు. రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 729 పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు… ఇక, ఇదే సమయంలో 987 కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,30,514కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 6,15,852కు పెరిగాయి… మృతుల సంఖ్య 987కు చేరింది.. ప్రస్తుతం […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికించింది… ఎన్నో కుటుంబాలను పొట్టనబెట్టుకుంది.. అయితే, కరోనాతో కన్నుమూశారంటే.. వారిని చూసేందుకు వచ్చేవారు కూడా లేకుండా పోయారు.. ఇదే ఆ దంపతులకు కలిసి వచ్చింది.. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కరోనా సమయంలో మృతదేహాల పైనుంచి నగలు మాయం చేశారు దంపతులు.. ఇప్పటి వరకు ఏడు మృతదేహాల నుంచి నగలను కొట్టేసినట్టు గుర్తించారు.. టిమ్స్ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పని చేస్తున్న దంపతులు.. కరోనాతో మృతిచెందినవారి నగలను […]
భూముల మార్కెట్ ధర సవరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఏడాది పాటు భూముల మార్కెట్ ధరలను సవరించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది… వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు భూముల మార్కెట్ ధరలను సవరించేదే లేదని స్పష్టం చేసింది… కరోనా మహమ్మారి వల్ల ప్రజలకు ఇబ్బందులుండడంతో భూముల మార్కెట్ ధరల విషయంలో సవరణ చేయకూడదని ప్రభుత్వం భావించగా.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ.. దీంతో.. […]