తెలంగాణ సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’పై ప్రత్యేకంగా ఫోకప్ పెట్టారు.. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలతో సమావేశం కూడా నిర్వహించారు సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి.. హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. రాజకీయంగా లబ్ధిపొందడానికే ఈ పథకం తెచ్చారని ఆరోపిస్తున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారం […]
తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు వర్షాలు దంచికొట్టాయి.. మరికొన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిశాయి.. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది.. ఈ తరుణంలో.. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణశాఖ (ఐఎండీ).. ఈ రోజు, రేపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రానున్న మూడు […]
కర్ణాటక నూతన సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు.. బెంగుళూరులోని రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించగా.. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. బొమ్మైతో ప్రమాణం చేయించారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రతినిధులతో పాటు మాజీ సీఎం యడ్యూరప్ప, ఇతర నేతలు హాజరయ్యారు. కర్ణాటక 23వ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక, సీఎంలైన తండ్రి-కొడుకుల జాబితాలో చేరిపోయారు బొమ్మై.. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడే ఈ బసవరాజు బొమ్మై. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన […]
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనది గుర్తుచేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడులో నివాళులర్పించారు రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సురేష్ షెట్కార్, తదితరులు.. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందని.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం […]
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఎలాగైనా బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలనే పట్టుదలతో ఏపీ ఉన్నా.. సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌తో వెనక్కి తగ్గి.. పరీక్షలు రద్దు చేస్తూ ప్రకటన చేసింది.. ఇక, ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు..? అని అంతా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. పరీక్షల ఫలితాలపై క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు […]
దెయ్యాల గురించి రకరకాలుగా కథలు చెబుతుంటారు.. కొందరు నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది అంటే.. మరికొందరు.. అక్కడ దెయ్యం ఇలా చేసిందటా? అని చెబుతుంటారు.. దెయ్యం కథలతో వచ్చే సినిమాలకు కూడా మంచి ఆదరణ లేకపోలేదు.. ఇక, అసలు విషయానికి వస్తే.. దెయ్యం క్రికెట్ గ్రైండ్లోకి దిగిందా..? బంతి పడకముందే.. దెయ్యమే వికెట్లు తీస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.. చరిత్రలో దెయ్యం తీసిన తొలి వికెట్ ఇదేనంటూ ఫన్నీగా కామెంట్లు కూడా పెడుతున్నారు.. ఈ […]
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాపై పలు సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు జి.కొండూరు పోలీసులు.. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధారణకు వెళ్లిన దేవినేని ఉమతో పాటు మొత్తం 18 మందిపై కేసులు పెట్టారు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌తో పాటు 307 కింద హత్యాయత్నం కేసులు పెట్టారు. అర్ధరాత్రి ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెదపారపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. […]
కబ్జా కోరులు రెచ్చిపోతున్నారు.. కోట్లాది విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు… షేక్‌పేట్ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేటుగాళ్లు ఏకంగా.. 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేశారు.. ఏసీబీ ప్రధాన కార్యాలయం ముందు ఉన్న 9 ఎకరాల స్థలంపై కన్నువేసిన కబ్జా కోరులు.. అందుకోసం షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు.. ఈ వ్యవహాన్ని పసిగట్టిన తహసీల్దార్.. రామ చంద్రరావు అనే వ్యక్తిపై బంజారాహిల్స్ […]
భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. గత బులెటిన్‌లో 30 వేలకు దిగువకు వెళ్లిపోయిన పాజిటివ్ కేసులు.. ఇవాళ ఏకంగా 43 వేలు దాటేశాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 17,36,857 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,654 మందికి పాజిటివ్‌గా తేలింది.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. ఒకేరోజు 640 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల […]