విరసం నేత, ప్రముఖ కవి వరవరరావు బెయిల్‌ను మరోసారి పొడిగించింది బాంబే హైకోర్టు.. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు బాంబేలోనే ఉండాలని స్పష్టం చేసింది. కాగా, ఎల్గార్ పరిషద్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో వున్న వరవరరావుకు […]
కరోనా మహమ్మారి తరిమేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.. భారత్ ఒకేరోజు కోటి డోసుల వ్యాక్సిన్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. తాజాగా, భారత్ వ్యాక్సినేషన్లో కొత్త రికార్డు సృష్టించింది.. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.. ఆ నెలలో జీ7 దేశాల్లో వేసిన మొత్తం వ్యాక్సిన్ల కంటే కూడా.. భారత్‌లో వేసిన వ్యాక్సిన్ల సంఖ్యే ఎక్కువని తెలిపింది కేంద్రం.. ఆగస్టు నెలలో భారత్‌లో […]
తెలంగాణ జానపదానికి ఉన్న ఫాలోయింగే వేరు.. ఎప్పటికప్పుడు ఒక్కోపాట తెగ ట్రెండ్ అవుతుంది.. ఎక్కడికి వెళ్లినా అదే పాట ఇనిపిస్తుంటింది.. ఇప్పుడు తెలంగాణతో పాటు ఏపీలోనూ ట్రెండింగ్‌లో ఉన్న పాట బుల్లెట్ బండి… ఆ మధ్య ఓ వధువు.. పెళ్లి బరాత్‌లో ఈ పాటకు స్టెప్పులు వేయడంతో తెగ వైరల్ అయిపోయింది.. ఇక, ఆ తర్వాత ప్రతీ పెళ్లిలో బుల్లెట్ బండి పాట ఉండాల్సిందే అనే తరహాలో.. చాలా పెళ్లిళ్లలో ఈ పాటకు కాలు కదుపుతున్నారు. ఇప్పటికే […]
కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వాటితో దీర్ఘకాలంలో రైతులకు చాలా మేలు జరుగుతుందని చెబుతూ వస్తోంది.. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘకాలంగా రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నా.. మొదట్లో చర్చలు జరిపినట్టే జరిపి.. ఆ తర్వాత లైట్ తీసుకుంది కేంద్రం.. అయితే, ఉన్నట్టుండి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళలన చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు వరుణ్ గాంధీ… రైతుల బాధలను కేంద్రం […]
ఈటల రాజేందర్ చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్స్ లో టీఆర్ఎస్లో పలువురు ఇతర పార్టీలకు చెందినవారు చేరారు.. వారికి పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన హరీష్‌రావు.. దళిత […]
ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు… బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.. కాగా, బ్రాహ్మణులను విదేశీయులుగా పేర్కొన్న నంద్‌కుమార్ బాఘేల్.. వారిని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు.. అయితే, ఈ ఘటనపై మండిపడ్డ బ్రాహ్మణ సంఘాలు.. నంద్ కుమార్ బాఘేల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ.. రాయ్‌పూర్‌లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. దాంతో ఆయనపై ఐపీసీ 153-ఏ, 505(1)(బీ) కింద […]
పాకిస్థాన్‌లో మరోసారి దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు.. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇవాళ ఆత్మాహుతి దాడి జరిగింది… ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రగాయాలపాలైన స్థానిక మీడియా పేర్కొంది… ఇక, ఈ దాడి తమపనేనంటూ తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.. ఆత్మాహుతి దాడిపై మీడియాతో మాట్లాడిన క్వెట్టా డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ అజహర్ అక్రమ్.. క్వెట్టాలోని మస్టుంగ్ రోడ్డులో ఉన్న ఫ్రాంటియర్ కార్ప్స్ చెక్‌పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి జరిగిందని.. దాడిలో […]
సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం వైఎస్ జగన్ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేవారు జూపూడి ప్రభాకర్… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్న ఆయన.. తన కేబిన్‌లో కూడా బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించారని ప్రశంసించారు.. చంద్రబాబు హయాంలో ఎందుకు సామాజిక న్యాయం పాటించలేక పోయారు? అని ప్రశ్నించిన జూపూడి.. ఒక ఎస్టీని డీజీపీగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారని.. ఎస్టీ అధికారి […]
2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించాల్సింది ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి… విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వార్డు, సీతమ్మదార నార్త్ ఎక్స్టెన్షన్ లో స్నీపర్ పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సాయిరెడ్డి.. మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గొల్లబాబురావు, జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి తదితరలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అనేక […]
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సొంత పార్టీకి చెందిన మహిళా నేతే ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది… తననూ, తన కుమారులను చంపుతానని ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ మహిళా నేత పద్మా రెడ్డి… ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మంచిర్యాల ఏసీపీకి ఫిర్యాదు చేశారు.. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి బూతులు తిట్టాడని ఆరోపించిన ఆమె.. నా ఇద్దరు కుమారులను, నన్ను చంపేస్తానని ఎమ్మెల్యే చిన్నయ్య వార్నింగ్ ఇచ్చాడనీ.. […]