బీఏసీలో ఆసక్తికర చర్చ.. చంద్రబాబు మొహం చూడాలని ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. అయితే, తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ఆసక్తికరమైన చర్చే సాగింది.. గెలుపు ఓటముల నుంచి.. మొహాలు చూసుకునే వరకు.. మీరు ఓడారంటే.. మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసంటూ.. ఇలా అధికార ప్రతిపక్ష నేతల మధ్య చాలా సేపే చర్చ సాగింది.. కుప్పం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ప్రస్తావనకు రాగా… సభకు చంద్రబాబును తీసుకు రండి.. కుప్పం ఫలితాల తర్వాత ఆయన మొహం చూడాలని ఉందని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.. అయితే, గెలుపోటములు సర్వ సాధారణమేనని బదులిచ్చిన టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు.. ఇదే సమయంలో చంద్రబాబు సభకు కచ్చితంగా వస్తారని స్పష్టం చేశారు..
Read Also: ఏ4 సైజు పేపర్ వినియోగంపై హైకోర్టులో విచారణ
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
మరోవైపు.. నెల్లూరులో అచ్చెన్న ఇంఛార్జ్‌గా ఉన్నారని గుర్తుచేశారు మంత్రి అనిల్ కుమార్.. దీనిపై కాస్త అసహనం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు.. బీఏసీలో ఎన్నికల ప్రస్తావన దేనికి..? ఎన్నికల్లో ఎలా గెలిచారో అందరికీ తెలుసని కౌంటర్ ఇచ్చారు. అయితే, సభకు చంద్రబాబు వచ్చేలా చూడాలని ఒకటికి రెండు సార్లు అచ్చెన్న వద్ద సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారట.. కుప్పం గురించి మాట్లాడేందుకు చాలా ఉన్నాయని సీఎం అంటే.. కుప్పంలో ఎలా గెలిచారో మీకూ తెలుసు.. మాకూ తెలుసు అంటూ అచ్చెన్న బదులు ఇచ్చారు.
ఇక, ఒక్క రోజు మాత్రమే సభను జరుపుదామని భావిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించగా.. చాలా సమస్యలున్నాయి.. 15 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని టీడీపీ కోరింది.. కోవిడ్ సమయంలో సభను ఆన్ లైన్ ద్వారా నడపాలని గతంలో టీడీపీనే ప్రస్తావించింది కదా? అని ఆర్థిక మంత్రి బుగ్గన గుర్తుచేయగా.. గ్రేట్ అచ్చెన్నాయుడు.. పెద్దాయన ప్రత్యేకంగా అడుగుతున్నప్పుడు అంగీకరించకుంటే ఎలా అని అంటూ ఈ నెల 26వ తేదీ వరకు సభ జరుపుదామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.. సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేలా చూడాలని సీఎం జగన్ సూచనలు చేశారు.. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. దానికి పెద్ద హడావుడెందుకు లిమిటెడ్‌గా ఎమ్మెల్యేలు వెళ్తే సరిపోతుందని తెలిపారు.. ప్రతిపక్షం అడిగిన వెంటనే సీఎం అంగీకరించడం ఓ చరిత్రేనని ఈ సందర్భంగా మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. ఇలా.. ఎన్నికల ఫలితాల నుంచి సభ నిర్వహణ వరకు బీఏసీలో ఆసక్తికరమైన చర్చే సాగింది.
- Tags
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!