డిసెంబర్ 4, శనివారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు. రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా గుర్తింపు, రాణింపు లభిస్తుంది. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకొని తప్పటడుగు వేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.
Also Read
- Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
- Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
- Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
- Koti Deepotsavam Day-12: కోటి దీపోత్సవంలో రామేశ్వర వైభవం.. నేడు రామనాథస్వామి కల్యాణం.!
మిధునం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమంచి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. మీ మిత్రుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు అయిన వారి ఆరోగ్యం కలవరపరుస్తుంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి అధికమవుతుంది. అందరితో సఖ్యతగా మెలుగుతూ ఉల్లాసంగా గడుపుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
సింహం : ఈరోజు ఈ రాశివారు ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. వ్యాపారస్థులు అధిక శ్రమని, ఒత్తిడిని ఎదుర్కొనవలసి వస్తుంది. బంధువులను కలుసుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగువేస్తారు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనా లోపం వంటివి తప్పవు. ఎలర్జికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి పొందుతారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. సోదరులతో ఏకీభవించ లేకపోతారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి.
తుల : ఈ రోజు ఈ రాశివారికి అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి తప్పవు. రవాణా, ఎక్స్పోర్ట్, రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులు ఎదటివారితో మితంగా సంభాషించటం ఉత్తమం.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసిరాగలవు. ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ధనం ఏ మాత్రం ఆదా చేయలేకపోవడం వల్ల ఆందోళన చెందుతారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారికి వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత, మెకుకువ చాలా అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత పొందుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది.
మకరం : ఈ రోజు ఈ రాశివారికి బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం.
కుంభం : ఈ రోజు ఈరాశివారు ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చిరాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రయత్న పూర్వకంగా మొండి బాకీలు వసూలు కాగలవు. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి.
మీనం : ఈ రోజు ఈ రాశివారికి భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలత్తుతాయి. ఎటువంటి చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. సోదరీ సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
OTR: ‘నశా ముక్త్ భారత్’ వెనుక కేంద్ర మంత్రి అసలు ప్లాన్ ఇదేనా?
-
Off The Record: ‘ఎవర్రా వీళ్లంతా..?’ అంటూ జనసైనికుల ఫైర్
-
Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
-
IFFI 2026: గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మెగాస్టార్ సినిమా సందడి.. దేశవ్యాప్తంగా ఆ 5 చిత్రాల్లో ఒకటిగా రికార్డ్!
-
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ.. ఢిల్లీ పెద్దల బిగ్ స్కెచ్ ఇదేనా..?
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!