వంట గదిలో కుంపటి పెడుతున్నాయి వంట నూనెల ధరలు.. అమాంతం పెరిగిపోయిన వంట నూనెల ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి… పెట్రో ధరలు, గ్యాస్ బాదుడుకు తోడు వంట నూనెల ధరల ప్రభావం అందరిపై పడుతోంది.. అయితే, పండుగల వేళ వినియోగదారులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక, వంటనూనెలపై ఉన్న అగ్రిసెస్‌ను కూడా తగ్గించింది కేంద్రం.. దీంతో దేశీయంగా వంట […]
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి.. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. పార్టీలన్నీ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా.. బీజేపీయేతర పక్షాలన్నీ ఏకం కావాలంటున్నారు నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్.. ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి రావాలని కోరిన ఎన్సీపీ చీఫ్.. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) పొత్తుతో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే, […]
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.. కొన్ని సార్లు ప్రత్యేక డ్రైవ్ ద్వారా విస్తృతంగా వ్యాక్సిన్ వేస్తున్నారు అధికారులు.. అయితే, బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో మరికొన్ని రోజులు వ్యాక్సినేషన్‌కు సెలవులు ప్రకటించారు అధికారులు.. రేపు అనగా 14వ తేదీన వాక్సినేషన్ కు సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు, 14వ తేదీన వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,786 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 517 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో 826 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. […]
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి.. ఇక, ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది.. అయితే, ఇవాళ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో.. ఉప ఎన్నికల బరిలో మొత్తంగా 15 మంది అభ్యర్థులు మిగిలారు.. నోటిఫికేషన్ నుంచి నామినేషన్ గడువు ముగిసేలోపు మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. అందులో పరిశీలనలో 9 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.. […]
పాముతో కాటు వేయించి భార్యను హత్య చేసిన కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. మృతురాలు భర్త సూరజ్‌కు రెండు జీవిత ఖైదులను విధించింది.. తన భార్యను హత్య చేసిన కేసులో భర్త సూరజ్‌ను గత సోమవారం దోషిగా తేల్చిన కోర్టు.. ఇవాళ శిక్ష ఖరారు చేసింది. తీర్పు వెలువరించే సందర్భంగా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యంత అరుదైన కేసు.. ఈ నేరానికి దోషికి మరణశిక్ష విధించాలి.. […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల విత్‌డ్రా గడువు ముగిసింది.. ఇవాళ బీజేపీ తరపున నామినేషన్ వేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి కూడా నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.. ఇండిపెండెంట్ అభ్యర్థులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు కూడా నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా.. ఫైనల్‌గా బైపోల్ బరిలో 30 […]
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య కాకరేపుతున్నాయి.. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుండగా.. హుజురాబాద్ బై పోల్‌లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాయితీగా పోరాడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యాంగ మాట్లాడుతూ , ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, సంతలో కూరగాయలు […]
మంత్రి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హరీష్ అన్న బాగా ఎగురుతున్నావట ఆరు నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారు అని వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. అప్పుడు హరీష్ అన్నని గెలిపించాలని మళ్లీ మన యువకులు తిరగాల్సి వస్తది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈటల రాజేందర్ ను రాత్రికి రాత్రి […]
భారత్ నుంచి వెళ్లే వాళ్లపై అమలు చేస్తున్న కఠిన నిబంధనల్ని ఎత్తి వేసింది బ్రిటన్. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంటే కారణమని భావిస్తోంది బ్రిటన్. ఈ క్రమంలో మన దేశం నుంచి వెళ్లే వాళ్ల ద్వారా తమ పౌరులు కరోనా సోకుతుందంటూ ఇటీవల లేనిపోని భయాలు వ్యక్తం చేసింది. బ్రిటన్‌లో అనుమతి పొందిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా టీకాను మన దగ్గర కోవీషీల్డ్ పేరుతో ఇస్తున్నారు. కానీ… కోవీషీల్డ్ రెండు డోసులు తీసుకున్నా సరే విమానం […]