కరోనాపై తాజా రీసెర్చ్.. వైరస్ గాల్లో ఎంత సేపు ఉంటుందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రాగన్ కంట్రీ చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి క్రమంగా ప్రపంచదేశాలకు పాకింది.. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ.. ప్రజలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూనే ఉంది.. ఇక, సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ఇప్పుడు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.. అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో కొత్త కేసులు బీభత్సం సృష్టిస్తున్నాయి.. భారత్‌లోనూ వరుసగా పెరిగిపోతోన్న రోజువారి కేసులు 2 లక్షలకు చేరువగా వచ్చాయి.. అయితే, కరోనా వైరస్‌పై వ్యాప్తి, దాని ప్రభావం, ఇలా అనేక రీసెర్చ్‌లు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా, కరోనా వైరస్ గాల్లో ఎంత సమయం ఉంటుంది.. గాల్లో ఎంతసేపు మహమ్మారి ప్రభావం చూపగలదు లాంటి అంశాలపై కీలక విషయాలను బయటపెట్టింది యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్..
Read Also: సీఎంలతో ప్రధాని మోడీ కీలక భేటీ.. మళ్లీ లాక్‌డౌన్..?
Also Read
- Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
- Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
- Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
- Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
ఇక, బ్రిస్టల్ వర్సిటీకి చెందిన అధ్యయంలోని కీలక అంశాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్ 20 నిమిషాలకు పైగా గాల్లో ఉంటే దాని సామర్థ్యం 90 శాతం క్షీణిస్తుందని తేల్చింది.. అయితే, గాల్లో ఉన్న మొదటి 5 నిమిషాల్లోనే దాని ప్రభావం అధికంగా ఉంటుందని.. ఆ ఐదు నిమిషాల తర్వాత సంక్రమణ శక్తికి క్రమంగా కోల్పోతోందని పేర్కొంది.. అయితే, ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు మాస్కుల వాడకం తప్పనిసరి అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.. మాస్క్‌లు ధరిస్తూ.. భౌతికదూరం పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, దూరాన్ని పాటించడం వల్ల కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. అంతేకాదు.. కరోనా వ్యాప్తి చెందే ప్రాంతాలపై కూడా కొంత క్లారిటీ ఇచ్చారు.. వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాల్లో వైరస్ అధికంగా సంక్రమించే అవకాశం ఉంటుందని.. ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారించలని పేర్కొంది.. మొత్తంగా ప్రజలు దగ్గరగా ఉంటేనే వైరస్ సోకే ప్రమాదం ఎక్కువని ఆ అధ్యయనం తేల్చింది..
- Tags
తాజావార్తలు
-
Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
-
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
-
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
-
Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!