LPG Gas Price: భారీగా పెరిగిన గ్యాస్ ధర.. సిలిండర్‌పై రూ.105 పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాస్ ధరలు చూస్తేనే మంట మండుతున్నాయి… అయితే, ఈ సారి వడ్డింపులో వంట గ్యాస్ సిలిండర్ ధరకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.. తాజా ధరలను పరిశీలిస్తే.. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ. 105 పెరగగా.. కోల్‌కతాలో రూ. 108 పెరిగింది.. ఇక, 5 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది… కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.. మార్చి 1వ తేదీన సబ్సిడీ లేని 14 కిలోల సిలిండర్ (ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్) ధర మాత్రం పెరగలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ధర ఎటువంటి మార్పు లేకుండా రూ.899.5 వద్ద స్థిరంగా ఉండగా.. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను మాత్రం రూ.105 పెంచారు.
Read Also: Russia-Ukraine War: దాడులు మరింత ఉధృతం
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటించాయి.. వంట గ్యాస్ జోలికి పోకపోయినా.. చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 105 పెంచింది. ధర పెరిగిన తర్వాత, న్యూఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,012గా మారింది. కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఇక, 5 కేజీల సిలిండర్ ధర కూడా రూ.27 పెరిగింది.. దీంతో.. ఢిల్లీలో 5 కేజీల సిలిండర్ ధర రూ.569కి చేరింది.. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లలో ఎలాంటి పెంపుదల లేదు. కాగా, ఎల్‌పీజీ సిలిండర్ ధర భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రతి నెల సవరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. గత నెలలో అంటే ఫిబ్రవరి 2022లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రూ. 91.50 తగ్గగా.. ఇప్పులు మళ్లీ వడ్డించారు.. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ.105 పెరిగి రూ.1,907 నుంచి రూ.2,012కి చేరగా.. . కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.108 పెరిగి రూ.2,095కి చేరుకుంది. ఇంతకు ముందు దీని ధర రూ.1,987గా ఉంది. మరోవైపు ముంబైలో రూ.1963కి చేరింది వాణిజ్య గ్యాస్ ధర… గతంలో ఇది రూ.1857 ఉండగా.. ఇప్పుడు రూ.106 పెరిగింది. అదే సమయంలో చెన్నైలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2145.5కి పెరిగింది. ఇక్కడ రూ.65 వడ్డించారు.. ఇంతకు ముందు ధర రూ.2080.5.గా ఉంది..
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!