కాంగ్రెస్ పార్టీకి జాతీయ మరియు సహజ ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీయే… ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. కోట్లాది మంది ప్రజల ఆశాకిరణమం.. భవిష్యత్‌లో ఆయన ప్రధానమంత్రి వంటి ఉన్నత పాత్రను పోషించగలరంటూ ఆప్ నేత, పంజాబ్ ఎన్నికల సహ ఇన్‌ఛార్జ్ రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.. దీంతో రాఘవ్ చద్దా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది..
Read Also: Vijayashanti: పేరు గొప్ప.. ఊరు దిబ్బలా ఉంది..
దేశ ప్రజల ఆశాకిరణం కేజ్రీవాల్.. దేవుడి దయ, ప్రజలు అవకాశం ఇస్తే కాబోయే ప్రధాన మంత్రి ఆయనే అంటూ కామెంట్స్ చేశారు రాఘవ్ చద్దా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తూ రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్న ఆయన.. జాతీయ రాజకీయాల్లో కేజ్రీవాల్ తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీని అని అభిప్రాయడ్డారు.. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్.. ప్రధాన మంత్రి స్థాయిలో హోదాలో కనిపిస్తారంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేవారు.. ఇక, ఓ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందని ఎద్దేవా చేసిన ఆయన.. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడి.. పదేళ్లు కూడా కాకపోయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు.