జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది పార్టీ.. ఇవాళ ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల భేటీ అయ్యారు.. సభకు వచ్చే వారి రవాణా, పార్కింగ్ ఏర్పాట్ల పైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు.. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.. అయితే, జనసేన ఆవిర్భావ సభకు ప్రభుత్వం అనుమతి వస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేసిన జనసేన పార్టీ నేతలు.. అవసరం అయితే, హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.. జనసేన సభ నిర్వహణపై పర్మిషన్ ఇవ్వాలంటూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేస్తున్నాం.. పార్టీ ఆవిర్భావ సభకు వైసీపీ.. ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోందని ఆరోపించారు పార్టీ నేత నాదెండ్ల మనోహర్.. గత నెల 28వ తేదీన సభ నిర్వహించుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని.. సహకరించాలని డీజీపీ కోరినా సహకరించడం లేదని విమర్శించారు..
Read Also: Operation Ganga: పోలాండ్‌కు విద్యార్థులు.. రేపు భారత్‌కు తరలింపు
అయితే, మొత్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతించారు.. ఈనెల 14వ తేదీన తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగబోతుండగా.. 14వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు సభకు అనుమతి ఇచ్చారు పోలీసులు. కాగా, జనసేన ఆవిర్భావ సభా వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశాయి పార్టీ శ్రేణులు.. ఈ సభా వేదికగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కీలకమైన కార్యాచరణ ప్రకటిస్తారని ఇప్పటికే పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.