కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తోన్న తరుణంలో.. కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది కేంద్రం.. ఇప్పటికే కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య పెంచాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు వెళ్లాయి.. అయితే, రాష్ట్రంలోని అన్ని ఏఎన్ఎం, పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఆసుపత్రిలో […]
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతి భవన్ దగ్గర హల్ చల్ చేశారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రగతి భవన్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు జేసీ దివాకర్ రెడ్డి.. అయితే, అపాయింట్మెంట్ లేకుండా సీఎంను కలిసేందుకు లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు.. కానీ, సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కాకుంటే మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు జేసీ దివాకర్‌రెడ్డి… ఇక, పోలీసులు ఎంత […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దూకుడు పెంచింది ఆమ్ఆద్మీ పార్టీ.. ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇక, ఇవాళ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్ పేరును ప్రకటించారు.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు ఉన్న గోవాలో ఏకంగా 39 స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెట్టి.. ప్రతిష్టాత్మకంగా […]
నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. క్రంగా షార్ కేంద్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది… కేవలం ఒకేరోజు 142 పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో కలవరం మొదలైంది.. ఇక, నిన్న 91 మంది ఉద్యోగులకు పాజిటివ్‌గా తేలింది… సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లి వస్తున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది.. దీంతో.. పెద్ద ఎత్తున కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఇప్పటికే 50 […]
కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్ సీఎస్‌కు సమన్లు జారీ చేసింది.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది.. […]
మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కుమార్ తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. హైదరాబాద్ కొండాపూర్‌లోని పీవీ రమేష్ తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటికి వచ్చిన విజయవాడ పోలీసులు.. ఓ కేసులో భాగంగా విచారణకు రావాలంటూ నోటీసులు అందజేశారు.. రమేష్ కుమార్ తల్లిదండ్రులు వయసు 80 ఏళ్ల పైగానే ఉంటుంది.. ఈ నెల 22వ తేదీన పటమట పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు.. 2018లో రమేష్ కుమార్ సోదరుడిపై అండర్ సెక్షన్ 498ఏ, డీపీ […]
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాది పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.. ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్.. భాయతీయ జనతా పార్టీలో చేరింది. కొన్నాళ్లుగా బీజేపీతో టచ్‌లో ఉన్న అపర్ణ.. ఎన్నికల సమయంలో పార్టీ మారారు. కాగా, ఎస్పీ అధినేతగా అఖిలేష్ యాదవ్ ఎంపికైన తర్వాత తిరుగుబాటు చేశారు అపర్ణ యాదవ్.. కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉన్న ఆమె.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో బీజేపీలో చేరి […]
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో మలుపులు తిరిగి ఖరారైన పీఆర్సీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఫిట్ మెంట్ ఫిక్స్ చేసే సమయంలో సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్ మెంట్ మాత్రమే ఇస్తామన్న ప్రభుత్వం.. చివరకు 23 శాతానికి అంగీకరించింది. దీనికి ఉద్యోగ సంఘాలు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే తాజాగా హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం.. అధికారుల కమిటీ సిఫార్సులనే పాటిస్తూ ఆ మేరకు జీవోలు జారీ చేసింది. దీంతో సీఎంవో […]
ఓవైపు పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.. రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రాష్ట్ర అధ్యక్షుడు అశ్వినీ శర్మ సమక్షంలో… కాషాయ కండువా కప్పుకున్నారు. తమ పార్టీలోకి వచ్చిన జేజే సింగ్‌ను బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారు. 2017లో శిరోమణి అకాలీదళ్‌లో చేరిన జేజే సింగ్.. అదే ఏడాది […]
ముంబైలోని భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఐఎన్ఎస్ రణ్వీర్ అంతర్జాతీయ సరిహద్దు జలాల్లో విధులు నిర్వర్తిస్తోంది. యుద్ధనౌకలోని అంతర్గత కంపార్ట్మెంట్లో పేలుడు సంభవించడం వల్లే అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన నౌకాదళ సిబ్బంది పరిస్థితిని […]