కార్వీ చైర్మన్ పార్థసారథికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది.. కార్వీ సంస్థకు చెందిన రూ.1,984 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈడీ… కార్వీ సంస్థ ఎండీ పార్థసారథికి చెందిన షేర్లతో పాటు భూములు, భవనాలను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు ఇచ్చింది.. వీటిలో రూ. 213 కోట్లు విలువైన భూములు, రూ. 438 కోట్ల విలువైన షేర్లు, రూ.1,280 కోట్ల విలువ చేసే ఇతర ఆస్తులును ఉన్నట్లు ఈడీ అధికారులు తెలిపారు..
Read Also: Janasena: ఆవిర్భావ దినోత్సవ సభకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
కాగా, పెట్టుబడిదారులకు చెందిన షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టిన కార్వీ ఎండీ పార్థసారథి.. వాటిపై రుణాలు తీసుకున్నారు. పలు బ్యాంకుల్లో దాదాపు రూ.2800 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించి సొంత పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారు.. అయితే, బ్యాంకుల నుంచి పొందిన రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు పోలీసులను ఆశ్రయించాయి.. ఇక, కేసు నమోదు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.. కార్వీ చైర్మన్ పార్థసారథితో పాటు, మరో నలుగురిని అరెస్ట్ చేసింది.. మరోవైపు, సీసీఎస్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీల్యాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. ఇప్పుడు ఆస్తులు అటాచ్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.