హైదరాబాద్‌లో తరచూ డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి.. తాజాగా ఓ పంబ్ వ్యవహారం రచ్చగా మారింది.. పలువురు ప్రముఖుల పిల్లలను తప్పించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.. అయితే, ఇవాళ హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో పబ్ నిర్వాహకులతో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పబ్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు శ్రీనివాస్ గౌడ్.. అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించిన ఆయన.. రాష్ట్ర సర్కార్‌కు డబ్బు ముఖ్యం కాదు.. అవసరం అయితే మొత్తం పబ్‌లే బంద్ చేపిస్తామంటూ స్పష్టం చేశారు.
Read Also: Talasani: గవర్నర్ వ్యవస్థపై తలసాని సంచలన వ్యాఖ్యలు.. అసలు అవసరమా..?
రాష్ట్రంలో, హైదరాబాద్‌లో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.. రాష్ట్రంలో 40 శాతం భాగం హైదరాబాద్ ఉంది… డబ్బులకు ఆశపడి కొన్ని చీడపురుగులు అసాంఘిక పనులు చేస్తున్నాయి… వీటిపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గతంలోనే ముఖ్యమంత్రి ఆదేశించారని గుర్తు చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.. పేకాట, గుడుంబాని అరికట్టాం.. అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించిన ఆయన.. పబ్‌ల నిర్వహణ వెనుక ఎవ్వరు ఉన్న ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.. సొంత పార్టీ నేతలు ఉన్న వదిలి పెట్టకూడదు అని సీఎం ఆదేశించారు.. మా డిపార్ట్‌మెంట్ ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉందన్నారు. మా అధికారులు మఫ్టీలో ఉంటూ అన్నింటిని పరిశీలిస్తున్నారు… గాంజాకి సంబంధించిన ఎన్నో కేసుల్ని ఎక్సైజ్ శాఖ చేధించిందని.. ఇప్పటికే పబ్ నిర్వాహకులకు చెప్పిన తర్వాత కూడా మళ్లీ డ్రగ్స్ దొరికాయి.. ఇప్పుడు ఈ సమావేశంలో ఉన్న వారు ఎవరైనా ఇటువంటివి చేస్తే మానుకోండి… ఈ దందా చేయాలనుకునే వారు దేశంలో ఉండకండి.. కష్టపడి తెలంగాణ తెచ్చుకుంది, మీ లాంటి వారి కోసం కాదు.. చర్యలని ముమ్మరం చేస్తున్నాం, ఈ దందాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. మా దగ్గర డౌట్ ఉన్న వారి లిస్ట్ ఉంది.. వారిపై నిఘా పెట్టాం.. పబ్‌లో డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ పెడతాం.. చట్టాన్ని ఉపయోగించి అవసరం అయితే నగర బహిష్కరణ చేస్తాం అంటూ సీరియస్‌గా హెచ్చరించారు.
డ్రగ్స్ దందా చేయాలనుకునే వాళ్లు దేశం విడిచి వెళ్లండి అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఇక్కడ ఇటువంటి దందా చేస్తామంటే చూస్తూ ఉరుకోబోమన్న ఆయన.. రాష్ట్ర సర్కార్ కు డబ్బు ముఖ్యం కాదు… అవసరం అయితే మొత్తం బంద్ చేస్తామన్నారు.. అవసరం అయితే పబ్స్ లేకుండా కూడా చేస్తాం.. డబ్బే ప్రధానంగా ఈ దందా చేయాలనుకుంటే వారిని వదిలి పెట్టం అన్నారు.. పోలీసు, ఎక్సైజ్ శాఖ సహకారంతో చర్యలను ముమ్మరం చేస్తున్నాం.. మీరు ఇలానే చేస్తే నగరంలో పూర్తిగా పబ్స్ లేకుండా అవుతాయన్నారు.. నియమ నిబంధనలకు అనుగుణంగా నడిపించుకోండి.. 24 గంటల పర్మిషన్ ఉన్న వాటిలో కేవలం సర్వీస్ మాత్రమే చేయాలన్నారు.. ఇక, సీసీ కెమెరాలను ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కి అటాచ్ చేస్తాం.. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే దాని ఏరియా అధికారులు చూడాలి, దీనికి బాధ్యులు ఏరియా సీఐ, ఎస్సైగా తెలిపారు.. సౌండ్స్ కూడా పరిమితికి లోబడి ఉండాలి… దీనిపై ఫిర్యాదులు వస్తే దాన్ని తొలగిస్తామని తెలిపారు. ఇక, మొన్న జరిగిన ఘటనలో కేవలం అనుమానితులని మాత్రమే పట్టుకున్నాం… ఎవ్వరినీ కావాలని అరెస్ట్ చేయలేదన్న ఆయన.. పోలీస్, ఎక్సైజ్ అధికారులు ఇటువంటి చర్యలకు బాధ్యులు అని తెలిస్తే వారిపై వెంటనే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఆన్‌లైన్ డెలివరీ చేసేవారిపై కూడా నిఘా పెట్టినట్టు వెల్లడించారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.