ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు కొన్ని ప్రాంతాల్లో కాకరేపుతున్నాయి.. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు.. గుంటూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన రాధ రంగా రీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు గాదె బాలాజి.. అన్ని సామాజిక వర్గాల వారికి రంగా నాయకుడు.. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టుకపోవటం బాధాకరం అన్నారు.. రంగా పేరు పెట్టాలని అందరూ ఐకమత్యంతో కలిసి ముందుకొస్తున్నారన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం.. రంగాకి వైఎస్ కి […]
పార్లమెంట్ సమావేశాల్లో ఓ ఎంపీ వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రతి పెళ్లినీ దౌర్జన్యపూరితమైనదిగా, ప్రతి పురుషుడినీ రేపిస్ట్‌గా విమర్శించడం సరైన విధానం కాదని తెలిపారామె.. సీపీఐ సభ్యులు బినయ్ విశ్వం అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఇవాళ రాజ్యసభలో మాట్లాడిన ఆమె. మహిళలు, బాలలను కాపాడటం అందరికీ ముఖ్యమైన విషయమేనని స్పష్టం చేశారు.. కానీ, ప్రతి పెళ్లినీ, ప్రతి పురుషుడినీ విమర్శించడం మాత్రం సరికాదన్నారు.. కాగా, గృహ హింస […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి నాటాకాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై భిన్నవాధనలు వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారం కోర్టు మెట్లుఎక్కిన విషజ్ఞం తెలిసిందే కాగా.. చింతామణి నాటకం నిషేధంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ స్పందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.. నాటకంలో ఒక పాత్ర బాగోకపోతే […]
వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తోన్న ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే, చర్చల ద్వారా సమ్మెకు వెళ్లకుండా ఆపాలంటూ.. అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చేస్తున్నఆందోళన కార్యక్రమాలపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వివిధ అంశాలను చర్చలు ద్వారా పరిష్కరించుకునేందుకు ఆందోళనను విరమించి ముందుకు వచ్చేలా ఉద్యోగ సంఘాలను ఒప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్లను ఆదేశించారు. ఆర్ధికశాఖ […]
వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, పచ్చల కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం.. వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు. ఇక, శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్ […]
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు సిద్ధం అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే అన్ని స్కూళ్లను సిద్ధం చేశారు.. ఆన్లైన్ తరగతుల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్.. అయితే, రేపటి నుంచి కూడా ఆన్లైన్ తరగతులే కొనసాగుతాయింటూ ఉస్మానియా యూనివర్సిటీ సహా మరికొన్నియూనివర్సిటీలు నిర్ణయం తీసుకున్నాయి.. కాగా, ఆన్ లైన్ తరగతులపై యూనివర్సిటీల నిర్ణయంపై తెలంగాణ విద్యా శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు […]
ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఉపాధ్యాయ సంఘాల నేతలు.. నారాయణస్వామి వ్యాఖ్యలపై స్పందించిన ఫాప్టో ఛైర్మన్ సుధీర్ బాబు.. మా ఉపాధ్యాయుల పిల్లల్లో 50 శాతం పిల్లలు ప్రభుత్వ స్కూళ్లల్లోనే చదువుతున్నారు.. మరి మంత్రి నారాయణ స్వామి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు..? అంటూ నిలదీశారు.. మంత్రి నారాయణ స్వామి బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడదని హితవుపలికిన ఆయన.. పీఆర్సీ సమస్యను పరిష్కరించలేక దాట వేసేందుకే మంత్రులు ఈ నాటకాలు […]