ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఈపీఎఫ్‌వో… కనీస పింఛను పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి కార్మిక సంఘాలు.. ఈ నేపథ్యంలో కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వేస్తున్నట్టుగా సమాచారం.. ఉద్యోగులకు మెరుగైన స్థిర పెన్షన్ అందించే విధంగా కొత్త ఫిక్సిడ్ పెన్షన్ స్కీమ్‌ను తీసుకురావడానికి సిద్ధం అవుతోంది ఈపీఎఫ్‌వో.. దీని ప్రకారం.. ఫిక్సిడ్ పెన్షన్ మొత్తాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉద్యోగికి ఇవ్వనున్నారు.. ఇక, ఈ పథాన్ని స్వయం ఉపాధి పొందే […]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంజాబ్‌లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది… ఓవైపు పాలక కాంగ్రెస్.. మరోవైపు ఆప్, ఇంకో వైపు అమరీందర్‌సింగ్, బీజేపీ.. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారి ఉన్నారు.. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్యుద్ధం మాత్రం ముగియడంలేదు.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తానే సీఎం అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకున్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ భంగపాటు తప్పకపోగా.. సిట్టింగ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకే మరోసారి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ […]
జనగామలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో.. తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతారంటూ ప్రచారం జరిగింది.. దానికి ప్రధాన కారణం రాజ్యసభ వేదికగా మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలే కారణం.. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మాటల దాడికి దిగుతున్నారు.. అయితే, ఇవాళ కేంద్రాన్ని, ప్రధాని మోడీని, బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేసినా.. నరేంద్ర మోడీ చేసిన ఆ వ్యాఖ్యల జోలికి మాత్రం […]
పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసింది మద్రాస్ హైకోర్టు.. ప్రస్తుతం పోలీసు డిపార్ట్మెంట్లో 90 శాతం మంది అవినీతిపరులు ఉన్నారని.. 90 మంది అసమర్థులైన అధికారులతో పనిచేస్తున్నారని పేర్కొంది.. కనీసం కేసుల విచారణ సక్రమంగా నిర్వహించలేకపోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. పోలీసు శాఖలో కేవలం 10 శాతం మంది సిబ్బంది మాత్రమే నిజాయితీగా, సమర్థతతో ఉన్నారని.. అన్ని కేసుల్లోనూ విచారణ జరుపుతారని ఆ కొద్ది శాతం అధికారుల నుంచి ఆశించలేమని తేల్చి చెప్పింది.. అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు […]
తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది ఎస్ఎస్సీ బోర్డు.. ఆ షెడ్యూల్ ప్రకారం.. మే 11వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. 20వ తేదీతో పరీక్షలు పూర్తికానున్నాయి.. ఈ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది… ఇక, 11న ఫస్ట్ లాంగ్వేజ్, 12న సెకండ్ లాంగ్వేజ్, 13న థర్డ్ లాంగ్వేజ్ పరీక్షలు ఉండగా.. 14వ తేదీన మ్యాథ్స్, 16న జనరల్ సైన్స్, 17వ […]
ప్రధాని నరేంద్ర మోడీని దేశం నుంచి తరిమేస్తామంటూ హెచ్చరించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇచ్చారు.. జనగామలో జరిగిన గొడవపై స్పందిచిన కేసార్.. పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. బీజేపీ బిడ్డల్లారా మేం మంచివాళ్లం మిమ్మల్ని ఏమీ అనం.. కానీ, మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.. మా శక్తి ముందర మీరు ఎంత? […]
ప్రధాని నరేంద్ర మోడీ జాగ్రత్త.. నీ ఉడుత ఊపులకు భయపడం అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్… జనగామ బహిరంగసభ వేదికగా.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు కేసీఆర్.. 8 ఏళ్లుగా పైసా ఇవ్వకపోయినా కేంద్రాన్ని ఏమీ అనలేదన్న ఆయన.. అడ్డగోలుగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు.. ఇప్పుడు విద్యుత్ సంస్కరణల పేరుతో కొత్త పంచాయితీ పెడుతున్నారు.. ప్రతీ మోటారుకు విద్యుత్ మీటరు పెట్టాలంటున్నారని ఫైర్ అయ్యారు.. కానీ, […]
తెలుగు సినీ ప్రముఖులు-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… మంగళగిరిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌రెడ్డిది విచిత్ర ధోరణి.. కపట మనస్తత్వం అంటూ మండిపడ్డారు.. సమస్యను సృష్టిస్తారు… తానే పరిష్కరిస్తానని ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేసిన ఆయన.. సినీ ప్రముఖుల్ని పిలిచి పబ్లిసిటీ స్టంట్ చేశారని సెటైర్లు వేశారు.. సినీ ప్రముఖుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? […]
జనగామ కలెక్టరేట్ భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది… కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేతికి కొబ్బరికాయ అందించారు పూజారి.. ఆ వెంటనే.. తన పక్కనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి కొబ్బరికాయ ఇచ్చిన కేసీఆర్.. కొట్టాల్సిందిగా సూచించారు.. మొదట నిరాకరించినట్టుగానే కనిపించిన ఆయన.. మీరే కొట్టాలని కోరగా.. మరోసారి సీఎం సూచన చేయడంతో.. వెంటనే టెంకాయను కొట్టేశారు కోమటిరెడ్డి.. […]