ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం.. ప్రభుత్వం వర్సెస్ సినీ పరిశ్రమగా మారింది.. కొందరు స్టార్లు ఓపెన్‌గా ప్రభుత్వాన్ని విమర్శంచడంతో ఇది మరింత రచ్చ రచ్చ అయిపోయింది.. కొందరు సినీ పెద్దలు రంగంలోకి దిగి ఎవరూ ఏమీ మాట్లాడొద్దని సూచించారు.. ఇక, మెగాస్టార్ చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఏకాంతంగా సమావేశం అయ్యారు.. ఎవ్వరూ లేకుండా ఆయన ఒక్కరే వెళ్లడాన్ని కొందరు ఆహ్వానిస్తుంటే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, వైఎస్ జగన్-చిరంజీవి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు […]
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.. రెండో వన్డేలో టాస్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.. అయితే.. ఈ మ్యాచ్‌లో 64 పరుగులతో ఆకట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్‌లో టాప్‌స్కోరర్ కూడా అతడే.. ఇక, 83 బంతుల్లో 5 ఫోర్లతో 64 పరుగులు చేసిన సూర్యకుమార్.. వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకీ సూర్యకుమార్ సృష్టించినా ఆ ప్రపంచ రికార్డు విషయానికి వస్తే… […]
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సత్తా చాటిన టీమిండియా… రెండో వన్డేలో కాస్త చిన్న టార్గెట్‌నే ప్రత్యర్థి జట్టుముందు ఉంచింది.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.. సూర్యకుమార్ యాదవ్ 64 పరుగులతో.. కేఎల్ రాహుల్ 49 పరుగులతో రాణించారు.. రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రారంభించడంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. కెమర్ రోచ్ 5 పరుగుల వద్ద […]
ఒక్కో ఏడాది లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ పట్టాలు అందుకుంటున్నారు.. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కొందరు తగిన ఉద్యోగం దొరకపోయినా.. ఎక్కడో తోచిన పని చేసుకుంటున్నారు.. కొందరికి అది కూడా సాధ్యం కావడం లేదు.. ఇక, నిరుద్యోగం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అన్ని పార్టీలు.. మేం అధికారంలోకి వస్తే.. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తామిని హామీలు ఇవ్వడం మామూలే.. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చిన […]
టెలికం సంస్థల మధ్య అమాంతం తగ్గిపోయిన మొబైల్ టారిఫ్ ధరలు.. మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. గత ఏడాది చివర్లో దాదాపు అన్ని ప్రధాన టెలికం సంస్థలు అన్నీ టారిఫ్ ధరలు పెంచేసి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.. కానీ, మరోసారి తన యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పేందుకు ప్రముఖ టెలికం సంస్థల భారీ ఎయిర్టెల్ సిద్ధం అయినట్టు తెలుస్తోంది.. గత ఏడాదిలో మొబైల్ టారిఫ్ ధరల పెంపుతో భారతీ ఎయిర్‌టెల్‌కు మూడో త్రైమాసికంలో కలిసివచ్చింది.. మరోవైపు.. ఎయిర్‌టెల్‌లో […]
విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలంటూ డిమాండ్ పెరుగుతోంది… టీడీపీకి కూడా దీనిపై ఉద్యమానికి సిద్ధం అవుతుంది.. రేపు వేలాది మందితో ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రకటించారు టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు.. ఈ సందర్భంగా వంగవీటి రాధా, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఉమ… రంగా కుటుంబ సభ్యులు కూడా వారి సన్నిహితులైన కొడాలి నాని, వంశీమోహన్ ద్వారా ఈ జిల్లాకు రంగా పేరు పెట్టాలని […]
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.. కాంగ్రెస్ వల్లే ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయని ఆరోపించిన ఆయన.. ఆ పార్టీ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని, ఫలితంగా దేశానికి హాని జరుగుతుందంటూ ఫైర్ అయ్యారు.. భారత్ అంటే ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోడీ.. ఓ రేంజ్లో కాంగ్రెస్‌పై మాటల దాడికి దిగారు.. […]
క్రమంగా కరోనా కేసులు దిగివస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవు అని ప్రకటించింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు… కోవిడ్ మూడో వేవ్ తెలంగాణలో ముగిసిపోయిందన్నారు.. థర్డ్ వేవ్ జనవరి 28న పీక్ చూశామన్న ఆయన.. ఆ తరవాత తగ్గుతూ వచ్చిందన్నారు.. పాజిటివిటీ రేట్ తగ్గింది… తెలంగాణలో 2 శాతం లోపే పాజిటివిటీ రేటు ఉందన్నారు.. ఇక, […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. అనేక అంశాలపై స్పందించారు.. ఇక, రాష్ట్ర విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సరిగ్గా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు ఉండేవి కావన్నారు.. మరోవైపు.. రాష్ట్ర విభజనకు మేం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాజకీయ స్వార్థం కోసం ఏపీని హడావుడిగా విభజించారని ఆరోపించిన మోడీ… అయితే విభజన కోసం అనుసరించిన […]
కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారంపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది.. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిపిస్తోంది… ఘాటు విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి.. ఇప్పటికే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది టీడీపీ.. ఇక, డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.. మరోవైపు.. ఈ వ్యవహారంపై గవర్నర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత […]