తెలంగాణ ప్రభుత్వంపై కాసుల వర్షం కురిపిస్తోంది రిజిస్ట్రేషన్ల శాఖ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని రాబట్టింది… గతంలో ఎప్పుడూ రూ.10వేల కోట్ల మార్క్ చేరుకోలేదు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం.. గత ఆర్థిక సంవత్సరంలో 10 వేల కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకున్నా.. కేవలం రూ.5,243 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ రూ.12,500 కోట్లు పెట్టుకుంటే.. ఇప్పటికే రూ.10 వేల కోట్ల మార్క్‌ను దాటేసింది.. Read […]
తెలంగాణలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు ఓయూ విద్యార్థి నాయకులు.. ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై సీపీకు ఫిర్యాదు చేశారు.. ఇక, నకిలీ సర్టిఫికెట్ వ్యవహారాన్ని ఉస్మానియా అధికారులు కూడా ధృవీకరించారు.. నకిలీ సర్టిఫికెట్ విషయాన్ని సీపీకి వివరించారు విద్యార్థి నేతలు… కన్సల్టేషన్, ఎడ్యుకేషన్, ఇనిస్టిట్యూట్స్ అడ్డగా ఈ దందా సాగుతుందని సీపీ దృష్టికి తీసుకెళ్లారు.. […]
సింగరేణి కంపెనీలో పనిచేసే ఆఫీసర్లు, కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పింది యాజమాన్యం.. రూ.40 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు నిర్ణయం తీసుకుంది.. దీని కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ఒప్పందం చేసుకుంది… ఎస్బీఐలో ఖాతా ఉన్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఇకపై రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది… ఈ మేరకు సింగరేణి – ఎస్బీఐ మధ్య చారిత్రక ఒప్పందం జరిగింది… ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ మొత్తం రూ.20 […]
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడబోయి అపహాస్యం పాలువుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలని సూచించారు.. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.. ఇక, వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా తెలిపిన ఆయన.. మహా వృక్షం లాంటి వైఎస్ ఫ్యామిలీలో వివేకా ఘటన అందరినీ షాక్‌లో […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కిందకు దిగివస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,383 శాంపిల్స్ పరీక్షించగా.. 495 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ చిత్తూరు జిల్లాలో ఒక కోవిడ్ బాధితుడు మృతిచెందాడువ.. ఇదే సమయంలో.. 1,543 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. Read Also: Punjab Polls: కాంగ్రెస్ హామీల వర్షం.. మేం తిరిగి అధికారంలోకి వస్తే.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లోనూ మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగబోతోంది.. ఇవాళ ప్రచారానికి తెరపడింది.. అయితే, చివరి క్షణాల్లో అన్నట్టుగా.. ప్రచార సమయం ముగిసే ముందు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ… తాము మరోసారి అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామో చెబుతూ.. పంజాబ్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.. కాంగ్రెస్ తిరిగి అధికారంలో వస్తే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. మహిళలకు నెలకు రూ. 1,100 అందిస్తామని, ఏడాదికి […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాస్త దూరంగానే ఉంటున్నారు.. కొన్ని సందర్భాల్లో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నా.. వారి మధ్య మనస్పర్దలు కొనసాగుతూనే ఉన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నమాటలు.. అయితే, తాజాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక, రేవంత్, కోమటిరెడ్డి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. ఇద్దరూ రెడ్లు […]
ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పందించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్… పార్లమెంట్ సాక్షిగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకుంటే భావితరాలు క్షమించమని హెచ్చరించారు.. ఇక, ఏపీకి జరిగిన అన్యాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడాలని సూచించిన ఉండవల్లి.. బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలన్నారు.. ఎనిమిదేళ్ల క్రితం లోక్‌సభలో ఏపీ విభజన బిల్లు ఆమోదం జరిగినట్టు ప్రకటించారని తెలిపారన్న ఆయన.. రాష్ట్ర విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై […]
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే.. అయితే, ఈ నెల 14వ తేదీన శాంతి కళ్యాణం జరగాల్సి ఉండగా.. శనివారం సాయంత్రం అనగా రేపు శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్టు వెల్లడించారు చిన్నజీయర్ స్వామి.. సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి రాత్రి 8 గంటల తర్వాత శాంతి కళ్యాణాన్ని పూర్తిచేయనున్నట్టు తెలిపారు.. రామానుజ చార్యుల సోపాన మార్గంలో కళ్యాణము నిర్వహిస్తామని.. 108 కళ్యాణాలు ఒకే చోట జరిగిన చరిత్ర లేదన్నారు.. ఇక, […]
తెలంగాణ ప్రభుత్వం.. వెంచర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే ప్రభుత్వ భూములను వేలం వేయడంపై విమర్శలు వచ్చాయి.. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు కొందరు నేతలు.. అయితే, హైకోర్టు కూడా ప్రభుత్వ భూముల వేలానికి పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.. ఇక, మరోవైపు.. రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది… బ్యూటీ ఫుల్ లే ఔట్స్, వెంచర్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.. పదుల ఎకరాల్లో ప్రభుత్వ వెంచర్లు ఏర్పాటు […]